
మసల్గ తండాను సందర్శించిన ఉప వైద్యాధికారి
తానూరు: మండలంలోని మసల్గ తండాను జిల్లా ఉపవైద్యాధికారి ఆకాశ్ సోమవారం సందర్శించారు. గ్రామంలో ఇద్దరు మహిళలు, ఇద్ద రు పురుషులు కిడ్నీ వ్యాధితో బాదపడుతున్నా రు. విషయం తెలుసుకున్న జిల్లా ఉప వైద్యాధి కారి ఆకాశ్, ఆస్పత్రి సిబ్బందితో గ్రామానికి చే రుకుని వారి వివరాలను సేకరించారు. ఆస్పత్రి లో వైద్య పరీక్షలు చేయించుకున్న రిపోర్టులు ప రిశీలించారు. గ్రామంలో మరో నలుగురి రక్త న మూనాలను సేకరించారు. త్వరలో పరీక్షల వి వరాలు వెల్లడిస్తామన్నారు. ప్రతి ఒక్కరూ వ్య క్తిగత శుభ్రతతోపాటు పరిసరాల శుభ్రత పా టించాలని సూచించారు. ఆయన వెంట సూపర్‌వైజర్ అబ్దుల్ ఖాసిం, సిబ్బంది ఉన్నారు.