
హిందువుల ఐక్యతకు పంచ పరివర్తన్
నిర్మల్‌చైన్‌గేట్: హిందువుల ఐక్యతకు పంచ పరివర్తన్ ద్వారా ఆర్‌ఎస్‌ఎస్ కృషి చేస్తుందని వనవాసి కల్యాణ పరిషత్ తెలంగాణ ప్రాంత కార్యదర్శి వెంకటేశ్వర్‌రావు దేశ్‌పాండే అన్నా రు. ఆర్‌ఎస్‌ఎస్ శతాబ్ది ఉత్సవాల్లో భాగంగా బంగల్‌పేట్ బస్తీ ఆధ్వర్యంలో స్థానిక కమ్యూనిటీ హాల్‌లో విజయదశమి ఉత్సవం శని వారం నిర్వహించారు. ఈ సందర్భంగా వా రు మాట్లాడుతూ ఆర్‌ఎస్‌ఎస్ 1925లో ప్రారంభమై నేడు దేశవ్యాప్తంగా విస్తృత శాఖ లతో, విభిన్న రంగాలలో దేశభక్తి పూరిత, హిందుత్వ ఆధార సంస్థలతో ప్రపంచంలోని అనేక దేశాల్లో పనిచేస్తుందన్నారు. హిందువులలో ఐక్యతను శాఖ ఆధారంగా సంఘం పెంపొందిస్తుందన్నారు. ప్రపంచంలోని వివిధ మతాలను సమన్వయపరిచే సనాతన జీవన విలువలు హిందుత్వంలో ఉన్నాయన్నారు. దేశ అభివృద్ధి కోసం హిందువులు పంచ పరివర్తన కోసం పాటుపడాలన్నారు. కార్యక్రమంలో కొర్తికంటి లింగన్న, నగర కార్యవాహ కిన్నెర్ల రవి, మైసర్ల రమణ, సాధం అరవింద్, పి.కృష్ణ, విలాస్, మంద పవన్, సుదర్శన్‌చారి, శ్రీను, సాయి, మురళి పాల్గొన్నారు.