
వైభవంగా పవిత్రోత్సవాలు
ఆళ్లగడ్డ: దిగువ అహోబిలం శ్రీ ప్రహ్లాదవరదస్వామి ఆలయంలో మూడు రోజుల పాటు జరిగే వార్షిక పవిత్రోత్సవాలు మంగళవారం నుంచి వైభవంగా ప్రారంభమయ్యాయి. ఇందులో భాగంగా అహోబిలం మఠం పీఠాధిపతి శ్రీ రంగరాజ యతీంద్ర మహాదేశికన్ ఆధ్వర్యంలో మూలమూర్తులు శ్రీ ప్రహ్లాదవరదస్వామి, అమృతవల్లీ అమ్మవార్లకు ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం వేద పండితుల వేదమంత్రోచ్ఛారణలతో ఆస్థాన విద్వాంసుల మంగళవాయిద్యాల మధ్య పవిత్ర హోమాలు శాస్త్రోక్తంగా నిర్వహించారు. రాత్రి ఉత్సవమూర్తులైన శ్రీదేవి, భూదేవి సమేత శ్రీ ప్రహ్లాదవరదులకు గ్రామోత్సతం నిర్వహించారు. ఎగువ అహోబిలంలో సోమవారం పవిత్రోత్సవాలు ముగిసిన విషయం తెలిసిందే.
కంప్యూటర్ కోర్సులపై ఉచిత శిక్షణ
నంద్యాల(న్యూటౌన్): రాష్ట్ర నైపుణ్యాభివృద్ధి సంస్థ ఆధ్వర్యంలో ఈనెల 20 నుంచి స్థానిక ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో కంప్యూటర్ కోర్సులపై ఉచిత శిక్షణ ఇస్తున్నట్లు ప్రిన్సిపాల్ డాక్టర్ శశికళ తెలిపారు. ఈ సందర్భంగా ఆమె మా ట్లాడుతూ డిగ్రీ, బీటెక్ చేసిన వారికి పైథాన్ కోర్సు, ఇంటర్, ఆపై చదివిన యువతి,యువకులు డెమోస్టిక్ డేటా ఎంట్రీ ఆపరేటర్ కోర్సుల శిక్షణకు అర్హులన్నారు. శిక్షణ పూర్తిచేసిన వారికి రాష్ట్ర ప్రభుత్వం సర్టిఫికెట్ అందజేస్తుందని ఆమె తెలిపారు. వివరాల కోసం 8297812530ర్‌ను సంప్రదించాలన్నారు.
పీడీఎస్ బియ్యం పట్టివేత
ప్యాపిలి: చిరురుమాను సర్కిల్ వద్ద సోమవారం అర్ధరాత్రి విజిలెన్స్ అధికారులు 35 టన్నుల పీడీఎస్ బియ్యాన్ని పట్టుకున్నారు. బనగానపల్లె నంచి కర్ణాటక రాష్ట్రానికి అక్రమంగా పీడీఎస్ రైస్ తరలిస్తున్నట్లు సమాచారం అండటంతో విజిలెన్స్ అధికారులు తనిఖీలు నిర్వహించారు. జిల్లా సివిల్ సప్లై అధికారి రవిబాబు, ఎన్‌ఫోర్స్‌మెంట్ డిప్యూటీ తహసీల్దార్లు శేఖర్‌రెడ్డి, నాగేశ్వర్‌రెడ్డి తదితరులు వాహనాల తనిఖీ చేపడుతుండగా ఓ లారీలో పీడీఎస్ రైస్‌ను తరలిస్తున్నట్లు గుర్తించారు. 35 టన్నుల రేషన్ బియ్యాన్ని సీజ్ చేసి లారీని జలదుర్గం పోలీస్‌స్టేషన్‌కు తరలించారు. లారీ డ్రైవర్లు ప్రవీణ్, చిన్నమద్దిలేటిలను పోలీసులకు అప్పగించారు. అక్రమ బియ్యం తరలింపునకు సంబంధిచిన పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది. విజిలెన్స్ అధికారుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు ప్యాపిలి ఎస్‌ఐ మధుసూదన్ తెలిపారు.

వైభవంగా పవిత్రోత్సవాలు

వైభవంగా పవిత్రోత్సవాలు