
నవంబర్ 12న ఆర్‌యూ కాన్వొకేషన్
కర్నూలు కల్చరల్: రాయలసీమ యూనివర్సిటీ (ఆర్‌యూ) 4వ కాన్వొకేషన్ నవంబర్ 12న వర్సిటీలో నిర్వహిస్తున్నట్టు వైస్‌చాన్స్‌లర్ ప్రొఫెసర్ వి.వెంకటబసవరావు తెలిపారు. మంగళవారం ఆయన ‘సాక్షి’తో మాట్లాడుతూ కాన్వొకేషన్‌కు గవర్నర్, వర్సిటీ చాన్స్‌లర్ జస్టిస్ అబ్దుల్ నజీర్ హాజరవుతారన్నారు. 2021–22, 2022–23, 2023–24, 2024–25 విద్యా సంవత్సరాల్లో వర్సిటీ పరిధిలో యూజీ, పీజీ, బీఈడీ, బీపీఈడీ, ఎల్‌ఎల్‌బీ, ఎంబీఏ, ఎంసీఏ కోర్సులు పూర్తి చేసుకొని ఉత్తీర్ణత సాధించిన విద్యార్థులు వారి విద్యార్హత పట్టాలను పొందవచ్చన్నారు. ఇప్పటికే రెండుసార్లు కాన్వొకేషన్‌కు నోటిఫికేషన్ విడుదల చేయడంతో విద్యార్థులు దరఖాస్తు చేసుకున్నారన్నారు. యూజీ విద్యార్థులు 9404, పీజీ, ఇతర ప్రొఫెషనల్ కోర్సుల విద్యార్థులు 420, పీహెచ్‌డీ 148 మంది దరఖాస్తు చేసుకున్న వారిలో ఉన్నారన్నారు. 70 మంది విద్యార్థులకు గోల్డ్‌మెడల్స్ ప్రదానం చేయనున్నట్లు తెలిపారు.