
బంగారం హారం బహూకరణ
పాణ్యం: తిరుపతికి చెందిన కర్నాటి సుబ్బ ప్రశాంత్, స్వాతి దంపతులు కొత్తూరు గ్రామంలో వెలసిన శ్రీవల్లి సుబ్రమణ్యేశ్వరస్వామి ఆలయానికి బుధవారం బంగారం హారాన్ని బహూకరించారు. నాలుగు తులాల 200 మిల్లీ గ్రాముల బంగారం హారాన్ని బహూకరించినట్లు ఈఓ రామకృష్ణ తెలిపారు. దాతలకు తీర్థప్రపాదాలు అందించినట్లు చెప్పారు.
నేడు ఎస్సీ సెల్
విస్తృత స్థాయి సమావేశం
బొమ్మలసత్రం: నంద్యాల పట్టణంలోని తేజస్విని హోటల్‌లో గురువారం ఎస్సీసెల్ జిల్లా విస్తృత స్థాయి సమావేశం నిర్వహిస్తున్నట్లు వైఎస్సార్‌సీపీ జిల్లా అధ్యక్షుడు కాటసాని రాంభూపాల్‌రెడ్డి ఒక ప్రకటనలో తెలిపారు. ఈకార్యక్రమానికి ముఖ్యఅతిథులుగా ఎస్సీ సెల్ రాష్ట్ర అధ్యక్షుడు టీజే సుధకర్‌బాబు హాజరవుతున్నారని పేర్కొన్నారు. సమావేశానికి ఎస్సీ సెల్‌కు సంబంధించిన నాయకులందరూ హాజరుకావాలని కోరారు.
వ్యాధులపై అప్రమత్తత అవసరం
గోస్పాడు: వ్యాధులపై ప్రజలను ఆరోగ్య సిబ్బంది అప్రమత్తం చేయాలని డీఎంహెచ్‌ఓ డాక్టర్ వెంకటరమణ ఆదేశించారు. నంద్యాల గాంధీ నగర్‌లోని సమావేశపు మందిరంలో బుధవారం వ్యాధుల నియంత్రణపైఅవగాహన, శిక్షణ కార్యక్రమం నిర్వహించారు. జిల్లా మలేరియా అధికారి చంద్రశేఖరరావు అధ్యక్షతన నిర్వహించిన ఈ కార్యక్రమంలో డీఎంహెచ్‌ఓ మాట్లాడారు. మలేరియా, డెంగీ, చికెన్‌గున్యా, మెదడువాపు, బోదకాలు వంటి వ్యాధులు దోమకాటుతో వచ్చే అవకాశం ఉందన్నారు. ప్రతి ఒక్కరూ పరిసరాల పరిశుభ్రత పాటించాలన్నారు. ప్రతి శుక్రవారం ఫ్రైడే, డ్రైడే పాటించాలన్నారు. మెడికల్ కళాశాల అసిస్టెంట్ ప్రొఫెసర్ నిరంజన్, జిల్లా టీబీ, ఎయిడ్స్ నివారణ అధికారి డాక్టర్ శారదాబాయి, మలేరియా సబ్ యూనిట్ అధికారి విజయారెడ్డి, ఆరోగ్య కార్యకర్తలు పాల్గొన్నారు.
పార్లమెంట్ రాష్ట్రకార్యదర్శిగా దేశం సుధాకర్‌రెడ్డి
బొమ్మలసత్రం: వైఎస్సార్సీపీ పార్లమెంట్ రాష్ట్రకార్యదర్శిగా దేశం సుధాకర్‌రెడ్డిని నియమించారు. ఈ మేరకు పార్టీ కేంద్ర కార్యాలయం నుంచి ఉత్తర్వులు వచ్చాయి. నంద్యాల అసెంబ్లీ నియోజకవర్గానికి చెందిన దేశం సుధాకర్‌రెడ్డి పార్టీ కేంద్ర కార్యాలయంతో సమన్వయం చేసుకుంటూ సంబంధిత రీజినల్ కో ఆర్డినేటర్, పార్లమెంట్ నియోజకవర్గ పరిశీలకులకు సహాయకారిగా వ్యవహరించనున్నారు.
కర్నూలు సిటీ: అధికారంలో ఉన్నామని, తమకు ఎదురు లేదని తెలుగుదేశం పార్టీ నాయకులు బరితెగించారు. విద్యార్థులకు మధ్యాహ్నం భోజ నం వడ్డిస్తున్న ఒకరిపై పాణ్యం ఎమ్మెల్యే గౌరు చరిత అనుచరులు దాడికి పాల్పడ్డారు. బాధితులు పోలీసుస్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. వివరాలు.. కర్నూలు ప్రభుత్వ ఒకేషనల్ జూనియర్ కాలేజీ విద్యార్థులకు జీఎస్టీ 2.0పై వ్యాసరచన పోటీలు నిర్వహించారు. విజేతలకు బుధవారం ముఖ్య అతిథిగా ఎమ్మెల్యే గౌరు చరిత బహుమతులు ప్రదానం చేశారు. ఆమె తిరిగి వెళ్లే సందర్భంలో మధ్యాహ్న భోజనంపై కొంత మంది విద్యార్థులు ఫిర్యాదు చేశారు. ఆ సమమంలో అక్కడే ఉన్న వంట ఏజేన్సీ నిర్వాహకులకు చెందిన ఓ వ్యక్తికి, ఎమ్మెల్యే అనుచరుల మధ్య వాగ్వావాదం చోటు చేసుకుంది. ఈ సమయంలో వంట ఏజెన్సీ నిర్వాహకుల్లో ఒకరిపై ఎమ్మెల్యే అనుచరులు దాడి చేసినట్లు సమాచారం. ఇదే విషయంపై బాధితులు కర్నూలు 3వ పట్టణ పోలీసు స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. అదే విధంగా తమపై దాడి చేసిన వారిపై చర్యలు తీసుకునేంత వరకు బీక్యాంపులో ప్రభుత్వ జూనియర్, ప్రభుత్వ ఒకేషనల్ కాలేజీల్లో మధ్యాహ్న భోజనం చేయబోమని జిల్లా వృత్తి విద్యాధికారి కార్యాలయంలో వినతి పత్రం అందజేశారు. ఈ ఘటనపై జూనియర్, ఒకేషనల్ కాలేజీల ప్రిన్సిపాళ్లను అడుగగా తమకు తెలియని చెప్పారు. ఇదిలా ఉండగా పై రెండు కాలేజీల్లో వంట ఏజెన్సీని ఎలాగైనా మార్చాలనే ఉద్దేశంతో వివిధ సందర్భాల్లో టీడీపీ నేతలు ప్రయత్నించారు.

బంగారం హారం బహూకరణ