కల్తీ మద్యంతో ప్రజల్ని చంపేస్తారా? | - | Sakshi
Sakshi News home page

కల్తీ మద్యంతో ప్రజల్ని చంపేస్తారా?

Oct 9 2025 2:43 AM | Updated on Oct 9 2025 2:43 AM

కల్తీ మద్యంతో ప్రజల్ని చంపేస్తారా?

కల్తీ మద్యంతో ప్రజల్ని చంపేస్తారా?

కర్నూలు (టౌన్‌): ‘ రాష్ట్రంలో కల్తీ మద్యం ఏరులై పారుతోంది.. అమాయక ప్రజలు మద్యం తాగి పిట్టల్లా రాలుతున్నారు.. అయినా ఈ ప్రభుత్వం పట్టనట్లు వ్యవహరిస్తోంది.. చాలా దారుణం’ అని వైఎస్సార్‌సీపీ మహిళా విభాగం రాష్ట్ర వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ ఎస్వీ విజయ మనోహరి అన్నారు. ఎలాంటి చర్యలు తీసుకోకుండా ఇలాగే వ్యవహరిస్తూ కల్తీ మద్యంతో ప్రజల్ని చంపేస్తారా అని ప్రశ్నించారు. వైఎస్సార్‌సీపీ మహిళా విభాగం ఆధ్వర్యంలో బుధవారం కర్నూలులో నిరసన తెలిపారు. చిల్డ్రన్స్‌ పార్కు నుంచి ఎకై ్సజ్‌ కార్యాలయం వరకు మహిళలు ర్యాలీ నిర్వహించారు. ‘ సీఎం డౌన్‌.. డౌన్‌, కల్తీ మద్యం విక్రయాలు అరికట్టాలి’ అని నినాదాలు చేశారు. ‘నకిలీ మద్యంతో పేదలు పిట్టల్లా రాలిపోతున్నారు.. ప్రభుత్వ పెద్దలే మద్యం సూత్రధారులు.. రాష్ట్రంలో ఎన్‌–బ్రాండ్‌ విక్రయాలు’ తదితర ప్లకార్డులను ర్యాలీలో ప్రదర్శించారు. ఎకై ్సజ్‌ ఎన్‌ఫోర్స్‌మెంటు కార్యాలయం ఎదుట బైఠాయించారు. మద్యాన్ని పారబోసి బాటిళ్లను పగులకొట్టారు. ‘మద్యం తాగి ప్రజలు చనిపోతుంటే డిప్యూటీ సీఎం నోరు మెదపరేం, ఎకై ్సజ్‌ శాఖ మంత్రి కొల్లు రవీంద్ర ఎక్కడ’ అని ప్రశ్నించారు.

మహిళలకు రక్షణ కరువు

వైఎస్సార్‌సీపీ మహిళా విభాగం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కల్లా నాగవేణి రెడ్డి, భారతి, మంగమ్మ మాట్లాడారు. రాష్ట్ర ప్రభుత్వం పేద ప్రజల ప్రాణాలతో చెలగాటం ఆడుతోందని విమర్శించారు. నకిలీ మద్యం సరఫరా చేస్తూ పేద ప్రజలను నిలువు దోపిడీ చేస్తోందని ఆరోపించారు. అడ్డగోలు పర్మిట్‌ రూమ్‌లతో మహిళలకు రక్షణ లేకుండా పోయిందన్నారు. టీడీపీ నాయకులు వైన్‌ షాపుల ద్వారా కల్తీ మద్యం అమ్ముతుంటే డిప్యూటీ సీఎం పవన్‌ కళ్యాణ్‌ నోరు మెదపడం లేదన్నారు. ఈ ప్రభుత్వానికి మహిళల ఉసురు తగులుతుందన్నారు. ప్రభుత్వం ఇప్పటికై నా స్పందించి బెల్టు షాపులు రద్దు చేయాలని, కల్తీ మద్యాన్ని అరికట్టాలని, పర్మిట్‌ లైసెన్సులు రద్దు చేయాలని డిమాండ్‌ చేశారు. అనంతరం ఎకై ్సజ్‌ ఎన్‌ఫోర్స్‌మెంటు అసిస్టెంట్‌ కమిషనర్‌ హనుమంతరావుకు వినతిపత్రం అందజేశారు. కార్యక్రమంలో నగరపాలక కార్పొరేటర్లు ఆర్షియా ఫర్హీన్‌, మహిళలు పాల్గొన్నారు.

ఈ ప్రభుత్వానికి మహిళల ఉసురు

తగులుతుంది

వైఎస్సార్‌సీపీ మహిళా విభాగం

రాష్ట్ర వర్కింగ్‌ ప్రెసెడింట్‌

ఎస్వీ విజయ మనోహరి

దోషులను కఠినంగా శిక్షించాలి

నెల్లూరు, అన్నమయ్య జిల్లాల్లో కల్తీ మద్యం తాగి నలుగురు పేదలు మృతిచెందినా రాష్ట్రప్రభుత్వంలో చలనం లేదని ఎస్వీ విజయ మనో హరి విమర్శించారు. కల్తీ మద్యం విక్రయాల వెనుక రాష్ట్ర పెద్దలు ఉన్నారని ఆరోపించారు. కల్తీ మద్యం తయారు చేసేందుకు టీడీపీ నాయకులు ఏకంగా ఫ్యాక్టరీ నడుపుతున్నారంటే పరిస్థితి ఎంత అధ్వానంగా ఉందో అర్థమవుతోందన్నారు. కల్తీ మద్యం దోషులను కఠినంగా శిక్షించాలని డిమాండ్‌ చేశారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement