రాష్ట్రంలో అవినీతి, అరాచక పాలన! | - | Sakshi
Sakshi News home page

రాష్ట్రంలో అవినీతి, అరాచక పాలన!

Oct 9 2025 2:43 AM | Updated on Oct 9 2025 2:43 AM

రాష్ట్రంలో అవినీతి, అరాచక పాలన!

రాష్ట్రంలో అవినీతి, అరాచక పాలన!

డోన్‌: రాష్ట్రంలో అవినీతి, అరాచక పాలన సాగుతోందని రాష్ట్ర ఆర్థిక శాఖ మాజీ మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్‌రెడ్డి ధ్వజమెత్తారు. అభివృద్ధి చేయకుండా అనవసర ఆరోపణలు చేస్తూ టీడీపీ నేతలు కాలయాపన చేస్తున్నారని విమర్శించారు. ప్రగతి ఫలాలను ప్రజలకు అందించడమే నిజమైన పాలన అని అన్నారు. డోన్‌లో బుధవారం ప్యాపిలి, బేతంచెర్ల మండలాల వైఎస్సార్‌సీపీ బూత్‌కమిటీ కన్వీనర్ల సమావేశం నిర్వహించా రు. ఈ సందర్భంగా బుగ్గన మాట్లాడుతూ.. గత వైఎస్సార్‌సీపీ ప్రభుత్వంలో కోవిడ్‌ మహమ్మారిని కూడా లెక్కచేయకుండా అంతా అభివృద్ధి జరిగిందన్నారు. రాజకీయాలకు, పార్టీలకు అతీతంగా ప్రజలందరికీ సంక్షేమ పథకాలు అందాయన్నారు. రాష్ట్రంలో కూట మి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక నకిలీ మద్యం వ్యాపారం యథేచ్ఛగా సాగుతోందన్నారు. ఉచిత ఇసుక అని చెబుతూ అడ్డూ అదుపూ లేకుండా అ క్రమ రవాణా చేస్తున్నారని ఆరోపించారు. అక్రమ మై నింగ్‌తో ప్రజాధనాన్ని లూటీ చేస్తున్నారని ఆరోపించారు.

‘స్థానిక’ ఎన్నికలకు సిద్ధం

గత వైఎస్సార్‌సీపీ ప్రభుత్వం డోన్‌ నియోజకవర్గాన్ని అన్ని విధాలుగా అభివృద్ధి చేసిందని బుగ్గన అన్నారు. డోన్‌కు అప్పట్లోనే ఉత్తమ మున్సిపాలిటీగా అవార్డు దక్కిందనే విషయాన్ని టీడీపీ నాయకులు సైతం అంగీకరిస్తున్నారన్నారు. గత వైఎస్సార్‌సీపీ ప్రభుత్వంలో పరిపాలనను ఎలా సాగించామనే దానిపై ప్రజలకు కార్యకర్తలు అవగాహన కల్పించాల్సిన అవసరం ఉందన్నారు. ప్రతి బూత్‌కు కన్వీనర్లే కీలకమని, ప్రతి బూత్‌ పరిధిలో 40 మంది సురక్షితులైన కార్యకర్తలను తయారు చేసుకోవాల్సిన అవసరం ఏర్పడిందన్నారు. వైఎస్సార్‌సీపీ మళ్లీ అధికారంలోకి వస్తే వైఎస్‌ జగన్‌మోహన్‌ రెడ్డి 2.0 పాలన ఎలా ఉంటుందో ప్రజలకు తెలుస్తుందన్నారు. వచ్చే స్థానిక సంస్థల ఎన్నికలకు కార్యకర్తలందరూ సంసిద్ధంగా ఉండాలన్నారు. సమావేశంలో వైఎస్సార్‌సీపీ ప్యాపిలి మండల కన్వీనర్‌ పోదొడ్డి క్రిష్ణమూర్తి, పార్టీ నాయకులు చిన్నపూదెళ్ల రామచంద్రారెడ్డి, పెద్దపూదెళ్ల భాస్కర్‌ రెడ్డి, మెట్టుపల్లె వెంకటేశ్వరరెడ్డి, బూరుగల శ్యాంరెడ్డి, బోరెడ్డి రాము, రాజా మురళి, బోరా మల్లికార్జునరెడ్డి, గార్లదిన్నె రామసుబ్బయ్య, రాచెర్ల దివాకర్‌రెడ్డి, బేతంచెర్ల మండల కన్వీనర్‌ తిరుమలేశ్వరరెడ్డి, పార్టీ పట్టణ అధ్యక్షులు పిట్టల జాకీర్‌, ఎంపిపి బుగ్గన నాగభూషణంరెడ్డి, మున్సిపల్‌ చైర్మన్‌ చలంరెడ్డి, పార్టీ నాయకులు రామచంద్రుడు, మురళీక్రిష్న, లక్ష్మిరెడ్డి, ఇబ్రహీం, కోట్ల మధుసూధన్‌ రావ్‌, మురళీధర్‌రెడ్డి, చలపతిరెడ్డి, బుగ్గన చంద్రారెడ్డి, బలరాంరెడ్డి, ఎద్దులన్న తదితరులు పాల్గొన్నారు.

యథేచ్ఛగా నకిలీ మద్యం వ్యాపారం

అడ్డూఅదుపూ లేని

ఇసుక అక్రమ రవాణా

అక్రమ మైనింగ్‌తో ప్రజాధనం లూటీ

రాష్ట్ర ఆర్థిక శాఖ మాజీ మంత్రి

బుగ్గన రాజేంద్రనాథ్‌రెడ్డి

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement