
బిల్లులిస్తేనే బడిలోకి..
నల్లగొండ : బెస్ట్ అవైలబుల్ స్కీమ్‌కు సంబంధించిన బిల్లులు రావడం లేదని నల్లగొండలోని ఆల్ఫా స్కూల్ యాజమాన్యం సోమవారం విద్యార్థులను బడిలోకి అనుమతించలేదు. దీంతో విద్యార్థులు చాలా సేపు పాఠశాల ఎదుట వేచి ఉన్నారు. దీంతో విద్యార్థుల తల్లిదండ్రులు అక్కడికి చేరుకుని పిల్లలను తీసుకుని.. కుల వివక్ష వ్యతిరేక పోరాట సంఘం (కేవీపీఎస్) ఆధ్వర్యంలో కలెక్టరేట్ ఎదుట ఆందోళన చేపట్టారు. ఈ సందర్భంగా కేవీపీఎస్ జిల్లా ప్రధాన కార్యదర్శి పాలడుగు నాగార్జున మాట్లాడుతూ బెస్ట్ అవైలబుల్ స్కీమ్‌కు సంబంధించి మూడు సంవత్సరాలుగా బిల్లులు పెండింగ్‌లో ఉన్నాయని వెంటనే విడుదల చేయాలని ప్రైవేట్ స్కూల్ యజమానులు కూడా పలుమార్లు ప్రభుత్వానికి విన్నవించినా ఎటువంటి స్పందన రావడం లేదన్నారు. ఆందోళన చేస్తున్న సమయంలో కలెక్టరేట్ నుంచి బయటికి వస్తున్న కలెక్టర్‌ను కలిసి తమ పిల్లల భవిష్యత్‌ను కాపాడాలని తల్లిదండ్రులు విన్నవించారు. ఈ సందర్భంగా కలెక్టర్ ఇలా త్రిపాఠి మా ట్లాడుతూ ప్రైవేట్ స్కూల్ యాజమాన్యంతో చర్చించి విద్యార్థులను స్కూళ్లు, హాస్టళ్లలో చేర్పించేలా చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు. అనంతరం వారు అదనపు కలెక్టర్ శ్రీనివాస్‌కు వినతిపత్రం అందజేశారు. కార్యక్రమంలో పేరెంట్స్ కమిటీ నాయకులు కార్తీక్, మామిడి జగన్, స్వామి, గాదె నర్సింహ, శోభన్, సాహితి, అరుణ, రాజేశ్వరి, లక్ష్మి, సోమని, శ్యామ్, నరేష్, నామ శ్రీనివాస్ పాల్గొన్నారు.
ఫ బెస్ట్ అవైలబుల్ స్కీమ్ బిల్లులు
ఇవ్వలేదని విద్యార్థులను అనుమతించని ఆల్ఫా స్కూల్ యాజమాన్యం
ఫ కలెక్టర్‌ను కలిసి
మొర పెట్టుకున్న తల్లిదండ్రులు

బిల్లులిస్తేనే బడిలోకి..