కేంద్రాలకు ధాన్యం.. కొనుగోళ్లకు కలగని మోక్షం
తిప్పర్తి : వానాకాలం సీజన్ ధాన్యం కొనుగోలు కేంద్రాలకు వస్తోంది. నాన్ ఆయకట్టులో ముందస్తుగా నాట్లు వేసిన పొలాలు ప్రస్తుతం చేతికి రావడంతో రైతులు కోతలు కోసి ధాన్యాన్ని సమీపంలో కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేసే ప్రాంతాలకు తరలిస్తున్నారు. కానీ ధాన్యం కొనుగోలు కేంద్రాలు ప్రారంభం కాకపోవడం.. వర్షాలు వచ్చే అవకాశం ఉండడంతో పలువురు రైతులు ధాన్యాన్ని మిల్లుకు తరలిస్తున్నారు. ఇదే అదునుగా భావించి మిల్లర్లు క్వింటా ధాన్యం రూ.1700 వరకే అడుగుతున్నారు. దీంతో రైతులు నష్టపోతున్నారు. ప్రభుత్వం వెంటనే కొనుగోలు కేంద్రాలను ప్రారంభించాలని రైతులు కోరుతున్నారు.


