బాక్సింగ్ సెలక్షన్ పోటీలు
మిర్యాలగూడ : స్కూల్ గేమ్స్ ఫెడరేషన్ ఆధ్వర్యంలో ఉమ్మడి నల్లగొండ జిల్లా బాక్సింగ్ సెలక్షన్ పోటీలు మిర్యాలగూడలోని ఎన్‌ఎస్పీ క్యాంప్ గ్రౌండ్‌లో గల బాక్సింగ్ కోచింగ్ సెంటర్‌లో సోమవారం జరిగాయి. అండర్ –14, 17 బాలబాలికల ఎంపిక పోటీలను ఎస్‌జీఎఫ్ జిల్లా కార్యదర్శి దగ్గుపాటి విమల ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ వివిధ జిల్లాల నుంచి వచ్చిన క్రీడాకారులు తమ ఉత్తమ ప్రదర్శన ప్రదర్శించి రాష్ట్ర స్థాయికి ఎంపిక కావాలని కోరారు. గెలుపు ఓటమిలు సహజమని సెలక్ట్ కాకపోతే మళ్లీ మళ్లీ ప్రయత్నించాలని సూచించారు. ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా 45 మంది ఈ పోటీలకు హాజరు కాగా అండర్–14 బాలుర విభాగంలో ఎండీ.యూసుఫ్, ఉమామహేశ్వర్‌రెడ్డి, సూర్యవర్మ, లోకేష్, రెహమాన్, ముజాహిద్ రెహమాన్, అండర్–17 బాలుర విభాగంలో రూపక్ రామ్, నవదీప్, శివ, నిపాన్, ఆరిఫ్, ఎన్.శివ, సాయిసిద్దార్థ, అబ్ధుల్ రెహమాన్, హరినాద్, ఎండీ.తౌసిఫ్, దేవా, నాగరాజు, తరుణ్, అండర్–17 బాలికల విభాగంలో లేఖనమాల్య, భుష్రా, సాయిప్రసన్న, నిహారిక, ప్రిన్సి ఎంపికై నట్లు తెలిపారు. కార్యక్రమంలో ఎంఈఓ బాలునాయక్, శోభారాణి, నామిరెడ్డి శ్రీనివాస్‌రెడ్డి, పంగా సైదులు, బాల్తి వెంకటరత్నం, షమీమ్ అక్తర్, నాగలక్ష్మి, రవీందర్, సురేందర్‌రెడ్డి, సావిత్రి, జనార్దన్‌రెడ్డి, అష్రఫ్ అహ్మద్, శ్రీనివాస్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు.


