దేవరకొండ డిపోకు 90 ఏళ్లు
దేవరకొండ : దేవరకొండ డిపో ఏర్పాటు చేసి 90ఏళ్లు పూర్తయ్యాయి. ఈ సందర్భంగా సోమవారం డిపో ఆవరణలో ఉద్యోగులు, కార్మికుల సమక్షంలో డిపో మేనేజర్ తల్లాడ రమేష్ బాబు కేక్ కట్ చేసి స్వీట్లు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ నిజాం కాలంలో 1936 అక్టోబర్ 6న దేవరకొండ డిపోగా ఏర్పాటైందని ఆయన గుర్తు చేశారు. అప్పటి నుంచి ఇప్పటి వరకు దేవరకొండ ప్రాంత ప్రజలకు మెరుగైన సేవలందిస్తూ వారి ఆదరణ చూరగొన్నట్లు తెలిపారు. డిపో ఉద్యోగులు, కార్మికుల సమష్టి కృషితో ఉత్తమ సేవలు అందిస్తూ దేవరకొండ డిపో రాష్ట్రస్థాయిలో గుర్తింపు పొందిందన్నారు. కార్యక్రమంలో ఏడీఎం పడాల సైదులు, ఎంఎఫ్ కృష్ణయ్య, టీఐ దీప్‌లాల్, పాపరాజు, సమద్, ఉద్యోగులు, కార్మికులున్నారు.


