
ఆన్‌లైన్ విధానం
వాహనదారులకు
అవగాహన కల్పించేలా..
నూతన విధానం ఇలా..
అంతర్‌రాష్ట్ర చెక్‌పోస్టుల వద్ద
మిర్యాలగూడ : అంతర్ రాష్ట్ర సరిహద్దుల వద్ద రవాణా శాఖ ఆధ్వర్యంలో ఉన్న చెక్‌పోస్టులను తొలగించి ఆన్‌లైన్ విధానంలో పన్ను వసూలు చేయనున్నారు. ఆఫ్‌లైన్ విధానంలో పన్నుల వసూలులో జరిగే అక్రమాలకు చెక్ పెట్టేందుకు ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంది. ఇప్పటికే అంతర్ రాష్ట్ర సరిహద్దుల్లో ఉన్న రవాణాశాఖ చెక్‌పోస్టులను ఎత్తివేస్తూ రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసిన విషయం తెలిసిందే. అయితే ఆయా చెక్‌పోస్టుల వద్ద ఆన్‌లైన్ విధానంలో పన్ను వసూలుకు సంబంధించిన ఏర్పాట్లు చేసేందుకు కొంత సమయం పట్టే అవకాశం ఉంది. దీంతో రవాణా శాఖ అధికారులు తాత్కాలికంగా చెక్‌పోస్టులు నిర్వహిస్తున్నారు. ప్రస్తుతం ఆయా చెక్‌పోస్టుల వద్ద ఆన్‌లైన్ విధానానికి సంబంధించిన ఏర్పాట్లను చేస్తున్నారు. ఈ విధానం అమలైతే వాహనదారులు తాత్కాలిక, పర్మినెంట్ ట్యాక్స్‌లను ఆన్‌లైన్‌లో చెల్లించి రాష్ట్రంలోకి ప్రవేశించాల్సి ఉంటుంది.
ఉమ్మడి జిల్లాలో మూడు చోట్ల..
తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డాక 2015లో రాష్ట్ర వ్యాప్తంగా 15 చెక్‌పోస్టులు ఏర్పాటు కాగా ఉమ్మడి నల్లగొండ జిల్లాలో వాడపల్లి, నాగార్జునసాగర్, కోదాడ సమీపంలోని నల్లబండగూడెం వద్ద తనిఖీ కేంద్రాలు ఏర్పాటు చేశారు. ఇతర రాష్ట్రాల నుంచి రాకపోకలు సాగించే తదితర వాహనాల నుంచి పన్ను వసూలు చేస్తున్నారు. ఈ చెక్‌పోస్టుల ద్వారా ప్రతి నెలా సుమారు రూ.2 కోట్ల వరకు ఆదాయం సమకూరుతోంది.
ప్రస్తుతం తాత్కాలికంగా చెక్‌పోస్టుల నిర్వహణ
రాష్ట్ర ప్రభుత్వం అంతర్ రాష్ట్ర సరిహద్దుల్లో ఉన్న రవాణాశాఖ చెక్‌పోస్టులను ఎత్తివేస్తూ ఇప్పటికే ఉత్తర్వులు జారీ చేసిన విషయం తెలిసిందే. అయితే ఆయా చెక్‌పోస్టుల వద్ద ఆన్‌లైన్ విధానంలో పన్ను వసూలుకు సంబంధించిన ఏర్పాట్లు చేసేందుకు కొంత సమయం పట్టే అవకాశం ఉంది. దీంతో రవాణా శాఖ అధికారులు తాత్కాలికంగా చెక్‌పోస్టులు నిర్వహిస్తున్నారు.
ఆన్‌లైన్ వసూళ్లపై అనుమానాలు..
చెక్‌పోస్ట్‌ను తొలగిస్తుండడంతో ఆన్‌లైన్ ద్వారా వచ్చే ఆదాయంపై అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. సరైన పర్యవేక్షణ లేకపోతే ఇతర రాష్ట్రాల నుంచి వాహనదారులు పన్ను చెల్లించకుండానే రాకపోకలు సాగించే అవకాశం ఉంది. ఆన్‌లైన్ చెల్లింపులపై అవగాహన కల్పించడంతోపాటు అనుమతులు లేకుండా తిరిగే వాహనదారులను గుర్తించి సరైన చర్యలు తీసుకున్నప్పుడే సత్ఫలితాలు వచ్చే అవకాశం ఉంది. అందుకు అనుగుణంగా పర్యవేక్షణ చేసేందుకు వాహనాలతోపాటు సిబ్బంది కూడా అవసరం ఏర్పడుతుంది. ప్రభుత్వం నిర్ధేశించిన మేర స్క్వాడ్ బృందం పర్యవేక్షించాల్సి ఉంటుంది.
ఆన్‌లైన్ పన్ను వసూలు చేయనున్న నేపథ్యంతో వాహనదారులకు అవగాహన కల్పించేలా.. చెక్‌పోస్టుల వద్ద ఇంగ్లిషు, తెలుగు, హిందీ భాషాల్లో ఫ్లెక్సీలు ఏర్పాటు చేశారు. ఆన్‌లైన్‌లో టెంపరరీ పర్మిట్, వాలంటరీ ట్యాక్స్, స్పెషల్ పర్మిట్‌ను ఏవిధంగా చేసుకోవాలో ఆ ఫ్లెక్సీలో వివరించారు. ప్రతి వాహనదారుడు ఆన్‌లైన్‌లో వాహనాల వివరాలను నమోదు చేసుకొని అనుమతి పొందాలని సూచిస్తున్నారు.
ఫ పన్ను చెల్లించిన వాహనాలకే ప్రవేశం
ఫ అక్రమంగా రాష్ట్రంలోకి
ప్రవేశించే వాహనాలపై కేసులు
ఫ నూతన విధానంపై వాహనదారులకు అవగాహన కల్పించేందుకు ఫ్లెక్సీల ఏర్పాటు
ఫ ఉమ్మడి జిల్లాలో
మూడు చోట్ల చెక్‌పోస్టులు
ఆన్‌లైన్ పన్ను వసూలుకు కోసం ప్రభుత్వం వాహన యాప్‌ను అమల్లోకి తెచ్చింది. ఈ విధానం అమలులో భాగంగా సరిహద్దు వద్ద రవాణాశాఖ ఏఎన్‌పీఆర్ (ఆటో నెంబర్ ప్లేట్ రీడర్) కెమెరాలను ఏర్పాటు చేయనున్నారు. ఇందుకోసం ఈ – ఎన్‌ఫోర్స్‌మెంట్ సాఫ్ట్‌వేర్‌ను రూపొందించారు. రాష్ట్రంలోకి ప్రవేశించే వాహనాలను గుర్తించేలా దానికి వాహన యాప్‌ను అనుసంధానం చేయనున్నారు. తద్వారా ఇతర రాష్ట్రాలకు చెందిన వాహనాల వివరాల తెలుస్తాయి. ఈ విధానం పూర్తిస్థాయిలో అమలైతే వాహనదారులు నిర్ధేశించిన వివరాలు నమోదు చేసి ఆన్‌లైన్‌లో నగదు చెల్లించాల్సి ఉంటుంది. ఎవరైనా అక్రమంగా ప్రవేశిస్తే మొబైల్ టీమ్‌లు వారిని పట్టుకుని కేసులు నమోదు చేస్తాయి.