పోలీస్ గ్రీవెన్స్‌డే రద్దు
నల్లగొండ: స్థానిక సంస్థలు ఎన్నికల ప్రవర్తనా నియమావళి అమలులో ఉన్నందున ప్రతి సోమవారం జరిగే పోలీస్ గ్రీవెన్స్ డే రద్దు చేసినట్లు ఎస్పీ శరత్‌చంద్ర పవార్ ఆదివారం ఒక ప్రకటనలో తెలిపారు. ఎన్నికల కోడ్ ముగిసిన తర్వాత పోలీస్ గ్రీవెన్స్ డే నిర్వహిస్తామని.. అప్పటి వరకు జిల్లా పోలీస్ కార్యాలయానికి బాధితులు రావద్దని పేర్కొన్నారు.
సాగర్‌లో పర్యాటకుల
సందడి
నాగార్జునసాగర్ : నాగార్జునసాగర్‌లో ఆదివారం పర్యాటకుల సందడి నెలకొంది. దసరా పండుగకు స్వగ్రామాలకు వెళ్లిన వారంతా ఆంధ్రా ప్రాంతం నుంచి హైద్రాబాద్, తదితర పట్టణాలకు వెళ్తూ మార్గమధ్యంలో ఉన్న సాగర్ అందాలను తిలకించారు. సాగర్‌డ్యాం దిగువన నదీతీరం వెంట, లాంచీ స్టేషన్, బుద్ధవనం, కొత్తబ్రిడ్జి, అనుపు, ఎత్తిపోతల తదితర ప్రాంతాల్లో సందడి చేశారు. వాహనాలు ఎక్కువగా నిలపడంతో కొత్తబ్రిడ్జి వద్ద ట్రాఫిక్ స్తంభించింది.
మూసీకి 2,248
క్యూసెక్కుల ఇన్‌ఫ్లో
కేతేపల్లి : మూసీ ప్రాజెక్టుకు ఎగువ నుంచి వరద తగ్గింది. మూసీ రిజర్వాయర్‌కు పదిహేను రోజుల నుంచి ఐదువేల క్యూసెక్కులకు పైగా వచ్చిన ఇన్‌ఫ్లో ఆదివారం 2,248 క్యూసెక్కులకు తగ్గిపోయింది. దీంతో ప్రాజెక్టు ఒక క్రస్ట్ గేటును రెండు అడుగుల మేర పైకెత్తిన అధికారులు 1,949 క్యూసెక్కుల నీటిని దిగువ మూసీకి వదులుతున్నారు. కుడి, ఎడమ ప్రధాన కాల్వల ద్వారా ఆయకట్టు భూములకు 603 క్యూసెక్కుల నీటిని విడుదల చేస్తున్నారు. సీపేజీ, లీకేజీ, ఆవిరి రూపంలో 50 క్యూసెక్కుల నీరు వృథా అవుతోంది. మూసీ ప్రాజెక్టులో గరిష్ట నీటిమట్టం 645 అడుగులు (4.46 టీఎంసీలు)కాగా ఆదివారం సాయంత్రం వరకు 643.80 అడుగుల(4.15 టీఎంసీలు)వద్ద నీరుంది.
నూతన కార్యవర్గం ఎన్నిక
రామగిరి(నల్లగొండ): ఆల్ ఇండియా పోస్టల్ ఎంప్లాయిస్ యూనియన్ పోస్ట్‌మెన్, ఎంటీఎస్ 42 వార్షిక మహాసభ ఆదివారం నల్లగొండ పట్టణంలో నిర్వహించారు. ఈ సందర్భంగా నూతన కార్యవర్గాన్ని ఎన్నుకున్నారు. అధ్యక్షుడిగా నల్ల యాదయ్య కార్యదర్శిగా కే కృష్ణయ్య ఎన్నికయ్యారు. ఫైనాన్సియల్ సెక్రెటరీగా సత్యనారాయణ ఎన్నికయ్యారు. వీరితో పాటు 15 మంది సభ్యులను ఎన్నుకున్నారు. కార్యక్రమంలో తెలంగాణ రాష్ట్ర ఏఐపీఈయూ పోస్ట్‌మెన్, ఎంటీఎస్ కార్యదర్శి ఏం. మధుసూదన్‌రావు, సీఐటీయూ రాష్ట్ర ఉపాధ్యక్షుడు తుమ్మల వీరారెడ్డి తదితరులు పాల్గొన్నారు.
అలరించిన
నాట్యమయూరాలు
భువనగిరి: రాయగిరి మినీ శిల్పారామంలో సెప్టెంబర్ 29 నుంచి జరుగుతున్న దసరా ఉత్సవాలు అదివారం ముగిశాయి. చివరి రోజు హైదరాబాద్‌కు చెందిన తుమ్మాటి ప్రణవి శిష్యబృందం కళాకారులు కూచిపూడి నృత్యంలో అలరించారు. సెలవు దినం కావడంతో యాదగిరిశీడి దర్శనం అనంతరం తిరుగు ప్రయాణంలో భక్తులు పెద్ద సంఖ్యలో మినీశిల్పారామాన్ని సందర్శించారు. సాంస్కృతిక ప్రదర్శనలను తిలకించారు. చెరువులో బోటు షికారు చేసి, పార్కులో ఆహ్లాదంగా గడిపారు. కార్యక్రమంలో కళాకారిణులు అంజని, కీర్తన, సహస్ర, ప్రదీక్ష, రితిక, సాన్వి, దీప్తి తదితరులు పాల్గొన్నారు.
పోలీస్ గ్రీవెన్స్‌డే రద్దు


