
హిందూ సంఘటనతోనే రక్షణ
నల్లగొండ టూటౌన్ : హిందూ సంఘటన దేశానికి రక్షణ అని హిందువుల ఐక్యతకు పంచ పరివర్తన్ ద్వారా ఆర్‌ఎస్‌ఎస్ కృషి చేస్తోందని ఆర్‌ఎస్‌ఎస్ నల్లగొండ విభాగ్ సంఘ చాలక్ గార్లపాటి వెంకటయ్య అన్నారు. ఆర్‌ఎస్‌ఎస్ శతాబ్ధి ఉత్సవాల్లో భాగంగా ఆదివారం నల్లగొండ నగర శాఖ ఆధ్వర్యంలో మేకల అభినవ్ స్టేడియం నుంచి నాగార్జున కళాశాల వరకు పద సంచలన్ (ర్యాలీ) నిర్వహించిన అనంతరం ఆయన మాట్లాడారు. దేశ అభివృద్ధికి హిందువులు పంచ పరివర్తన కోసం పాటుపడాలని సూచించారు. కార్యక్రమంలో ఇటికాల కృష్ణయ్య, దోసపాటి శ్రీనివాస్, కాసం సత్యనారాయణ తదితరులు పాల్గొన్నారు.