
కృష్ణారెడ్డి ఆత్మీయ అభినందన సభ
రామగిరి (నల్లగొండ): మానవీయ స్ప్రహతో కూడిన కవిత్వం రాయడం బైరెడ్డి కృష్ణారెడ్డికే సాధ్యమని సాహితీవేత్త కె.కనకాచారి అన్నారు. ఆదివారం నల్లగొండలోని ఎస్పీఆర్ పాఠశాలలో నిర్వహించిన కృష్ణారెడ్డి ఆత్మీయ అభినందన సభలో ఆయన మాట్లాడారు. కవిత్వంలో కృష్ణారెడ్డికి సురవరం ప్రతాపరెడ్డి తెలుగు విశ్వవిద్యాలయం వారు కీర్తి పురస్కారం ప్రకటించిన సందర్భంగా ఈ ఆత్మీయ అభినందన సభ ఏర్పాటు చేశామన్నారు. నాలుగు దశాబ్దాలుగా ఆర్తి పేరుతో కవిత్వ సంపుటలు వెలువరిస్తూ కృష్ణారెడ్డి తనదైన ముద్ర వేశారన్నారు. అనంతరం కృష్ణారెడ్డిని సన్మానించారు. కార్యక్రమంలో మేరెడ్డి యాదగిరిరెడ్డి, పెరుమాళ్ళ ఆనంద్, మునాసు వెంకట్, తండు కృష్ణకౌండిన్య, కోమటి మధుసూదన్, మాదగాని శంకరయ్య, డాక్టర్ పగడాల నాగేందర్, ఎలికట్టె శంకర్‌రావు, హిమవంతరెడ్డి, బండారు శంకర్, సాగర్ల సత్తయ్య, భీమార్జున్‌రెడ్డి, దాసరి శ్రీరాములు, డాక్టర్ మేక ఉమారెడ్డి, గంటెకంపు గణేష్, డా.దైద రవి, సంధ్య, అంబటి వెంకన్న, దేవులపల్లి రామచంద్రయ్య, డాక్టర్ చింతోజు మల్లికార్జునచారి, బైరెడ్డి సత్యనారాయణరెడ్డి పాల్గొన్నారు.