ప్రముఖుల నివాళి
సూర్యాపేటలోని జిల్లా కాంగ్రెస్ పార్టీ కార్యాలయం (రెడ్ హౌస్)లో దామోదర్‌రెడ్డి పార్థివదేహానికి అసెంబ్లీ డిప్యూటీ స్పీకర్ రామచందర్ నాయక్, రాష్ట్ర మంత్రి సీతక్క శుక్రవారం రాత్రి పూలమాల వేసి నివాళులర్పించారు. అలాగే మాజీ మంత్రి, సీనియర్ నాయకుడు కుందూరు జానారెడ్డి, నాగార్జునసాగర్ ఎమ్మెల్యే జైవీర్ రెడ్డి, సూర్యాపేట ఎమ్మెల్యే జగదీష్‌రెడ్డి, ఎమ్మెల్సీ శంకర్‌నాయక్, రాష్ట్ర టూరిజం కార్పొరేషన్ చైర్మన్ పటేల్ రమేష్ రెడ్డి, మాజీ ఎమ్మెల్యేలు వేదాసు వెంకయ్య, జూలకంటి రంగారెడ్డి, సంకినేని వెంకటేశ్వరరావు, గాదరి కిషోర్, చిరుమర్తి లింగయ్య, దోసపాటి గోపాల్, వివిధ పార్టీల నాయకులు చెరుకు సుధాకర్, బడుగుల లింగయ్య యాదవ్, పిట్ట రాంరెడ్డి, మల్లు లక్ష్మి, మల్లు నాగార్జున రెడ్డి తదితరులు నివాళులర్పించారు. వీరి వెంట సూర్యాపేట వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ కొప్పుల వేణారెడ్డి, రైతు కమిషన్ సమన్వయ కమిటీ సభ్యుడు, డీసీసీ అధ్యక్షుడు చెవిటి వెంకన్న యాదవు సర్వోత్తమ్‌రెడ్డి వెంటే ఉన్నారు.


