ఆర్టిజన్ కార్మికులకు పెయిడ్ హాలిడేస్ ఇవ్వాలి
ములుగు రూరల్: ఆర్టిజన్ కార్మికులకు పెయిడ్ హాలిడేస్ ఇవ్వాలని యునైటెడ్ ఎలక్ట్రిసిటీ ఎంప్లాయీస్ యూనియన్ రాష్ట్ర అధ్యక్షుడు ఈశ్వరరావు డిమాండ్ చేశారు. ఈ మేరకు మంగళవారం జిల్లా కేంద్రంలోని విశ్రాంత ఉద్యోగుల భవన్‌లో సీఐటీయూ జిల్లా కార్యదర్శి రత్నం రాజేందర్ ఆధ్వర్యంలో సమావేశం నిర్వహించగా ఆయన ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడారు. కార్మికుల సమస్యల పరిష్కారానికి యూనియన్ ఎల్లప్పుడు పని చేస్తుందన్నారు. ఆర్టిజన్ కార్మికులు శ్రమ దోపిడీకి గురవుతున్నారని, కార్మికుల హక్కులకు భంగం కలిగిస్తూ మానసిక ఒత్తిడికి చేయడం సరికాదన్నారు. అనంతరం డివిజనల్ విద్యుత్‌శాఖ అధికారి నాగేశ్వర్‌రావును కలిసి సమస్యలను వివరించారు. ఈ కార్యక్రమంలో ఎన్పీడీసీఎల్ కంపెనీ సెక్రటరీ బొల్లి వెంకట్‌రాజ్, నాయకులు నలువాల స్వామి, భాస్కర్, శ్రీనివాస్, సాయిబాబా తదితరులు పాల్గొన్నారు.


