డీడీకి సన్మానం
ఏటూరునాగారం: ఏటూరునాగారం ఐటీడీఏ డీడీగా పదవీ బాధ్యతలను స్వీకరించిన దబ్బగట్ల జనార్దన్‌ను మంగళవారం ఆయన కార్యాలయంలో ఉమ్మడి జిల్లా స్పోర్ట్స్ ఆఫీసర్స్‌లు సన్మానించారు. గతంలో పనిచేసిన డీడీ పోచం బదిలీపై వెళ్లగా ఆయన స్థానంలో జనార్దన్ విధుల్లో చేరారు. ఈ కార్యక్రమంలో డిప్యూటీ డీఓ సారయ్య, ఏసీఎంఓ కోడి రవీందర్, స్పోర్ట్స్ ఆఫీసర్లు యాలం ఆదినారాయణ, వజ్జ నారాయణ, చుంచు కొమ్మాలు, ఆలం శ్యామలత, సిద్దబోయిన వెంకన్న, పీఈటీలు తాటి సతీష్, చింత రమేశ్ తదితరులు పాల్గొన్నారు.
ములుగు: సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి బీఆర్.గవాయ్‌పై ఓ లాయర్ దాడిని ఖండిస్తూ మంగళవారం ములుగు కోర్టు ఎదుట న్యాయవాదులు నిరసన వ్యక్తం చేశారు. దాడిని నిరసిస్తూ విధులకు హాజరుకాలేదు. జిల్లా కేంద్రంలోని అంబేడ్కర్ విగ్రహం వద్ద జేఏసీ చైర్మన్ ముంజాల భిక్షపతి ఆధ్వర్యంలో నాయకులు నిరసన వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో న్యాయవాదులు వేణుగోపాలచారి, వినయ్‌కుమార్, వెంకటేశ్వర్లు, సారంగపాణి, సుధాకర్, స్వామిదాస్ తదితరులు పాల్గొన్నారు.
ఏటూరునాగారం: మండలంలోని చిన్నబోయినపల్లి అటవీశాఖ భూమిలో అధికారుల ఆదేశాల మేరకు పండ్ల మొక్కలను నాటించామని ఎఫ్‌ఆర్‌ఓ అబ్దుల్ రెహమాన్ అన్నారు. మంగళవారం మండలకేంద్రంలోని ఎఫ్‌ఆర్‌ఓ కార్యాలయంలో విలేకరులతో మాట్లాడారు. అటవీ శాఖ ఆదీనంలో ఉన్న భూమిలో పండ్ల మొక్కలను నాటి అర్హులైన రైతులకు ఫలసాయం చేసేందుకు తాము ప్రయత్నిస్తున్నామన్నారు. అటవీశాఖ భూమి అన్యాక్రాంతం కాకుండా చూడడమే తమ బాధ్యతనన్నారు.
ఏటూరునాగారం: స్థానిక సంస్థల ఎన్నికల్లో ప్రతీ కార్యకర్త కాంగ్రెస్ పార్టీ వైఫల్యాలను ఇంటింటికీ వివరించాలని బీఆర్‌ఎస్ పార్టీ జిల్లా అధ్యక్షుడు కాకులమర్రి లక్ష్మీనర్సింహారావు అన్నారు. మంగళవారం మండలకేంద్రంలో ఇంటింటికీ తిరుగుతూ కాంగ్రెస్ పార్టీ బాకీ కార్డులను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ బీఆర్‌ఎస్ పార్టీ అమలు చేసిన సంక్షేమ పథకాలను ప్రజలకు వివరించి ప్రతీ గ్రామంలో గులాబీ జెండా ఎగురవేయాలన్నారు. జెడ్పీటీసీలు, సర్పంచ్‌లు, ఎంపీటీసీలను గెలిపించి కేసీఆర్, కేటీఆర్‌కు బహుమతిగా ఇవ్వాలన్నారు.
చిట్యాల: సైబర్ నేరాలపై ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సీఐ మల్లేష్ అన్నారు. మంగళవారం మండలంలోని లక్ష్మీపూర్‌తండాలో కార్డన్‌సెర్చ్ నిర్వహించారు. ఈ సందర్భంగా సీఐ మల్లేష్ మాట్లాడుతూ గ్రామంలో గంజాయి, గుట్కా, గుడుంబా అమ్మినా, కొత్త వ్యక్తులు కనబడినా వెంటనే పోలీసులకు సమాచారం అందించాలన్నారు. సైబర్ నేరాల పట్ల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని కోరారు. రోడ్డు భద్రత, ట్రాఫిక్ రూల్స్ పాటించాలని చెప్పారు. ప్రతి వాహనదారుడు తప్పకుండా హెల్మెట్ ధరించాలని అన్నారు. డయల్ 100, షీ టీమ్స్, సీసీ టీవీ కెమెరాలపై అవగాహన కల్పించారు. అనంతరం నాలుగు బృందాలుగా ఏర్పడి 110 ఇళ్లను తనిఖీ చేయగా ఎనమిది వాహనాలకు సరైనా ధృవపత్రాలు లేకపోవడంతో వాటిని సీజ్ చేసినట్లు చెప్పారు. 350 లీటర్ల గుడంబా పానకం ధ్వంసం చేశారు. పది లీటర్ల గుడుంబాను సీజ్‌చేసి ఇద్దరు వ్యక్తులపై కేసు నమోదు చేసినట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో ఎస్సైలు సిబ్బంది పాల్గొన్నారు.
డీడీకి సన్మానం
డీడీకి సన్మానం
డీడీకి సన్మానం
డీడీకి సన్మానం


