ఫారెస్ట్ చెక్‌పోస్టు పునరుద్ధరణ
కాటారం: కాటారం మండలకేంద్రానికి సమీపంలో జాతీయ రహదారిపై గతంలో ఏర్పాటు చేసిన ఫారెస్ట్ చెక్‌పోస్టును మంగళవారం నుంచి పునరుద్ధరించారు. కొంతకాలంగా చెక్‌పోస్టు నిర్వహణలో లేకపోవడంతో అక్రమ కలప రవాణా, ఇతరత్రా అసాంఘీక కార్యక్రమాలు యథేచ్ఛగా కొనసాగుతూ వచ్చాయి. దీంతో అటవీశాఖ ఉన్నతాధికారులు చెక్‌పోస్టు నిర్వహణపై దృష్టిసారించి తిరిగి ప్రారంభించారు. కాళేశ్వరం జోన్ సీసీఎఫ్ డాక్టర్ ప్రభాకర్, డీఎఫ్‌ఓ నవీన్‌రెడ్డి చెక్‌పోస్టును ప్రారంభించి సిబ్బందికి పలు సూచనలు చేశారు. చెక్‌పోస్టు ద్వారా ఇసుక లారీల నుంచి సెస్ ఫీజు వసూలు చేయనున్నట్లు సీసీఎఫ్ తెలిపారు. అక్రమ రవాణాపై నిరంతర నిఘా కొనసాగిస్తామని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో ఎఫ్‌డీఓ సందీప్, మహదేవపూర్ రేంజర్ రవి, సిబ్బంది పాల్గొన్నారు.


