
ఏటీసీలను సద్వినియోగం చేసుకోవాలి
ఏటూరునాగారం/వాజేడు: ఏటూరునాగారం, వాజేడు కేంద్రాల్లో నూతనంగా నెలకొల్పిన ఏటీసీ సెంటర్లను విద్యార్థులు సద్వినియోగం చేసుకోవాలని కలెక్టర్ దివాకర టీఎస్ అన్నారు. మంగళవారం మండల కేంద్రంలోని ఏటీసీ, వాజేడు ఏటీసీ లను ఆయన పరిశీలించి పరికరాల పనితీరును తనిఖీ చేశారు. అనంతరం ఆయన మాట్లాడుతూ అర్హులైన విద్యార్థులు ఏటీసీలో చేరి ఉజ్వల భవిష్యత్‌కు బాటలు వేసుకోవాలన్నారు. శిక్షణ నాణ్యత, వృత్తి విద్య సదుపాయాల విస్తరణ, విద్యార్థుల ప్రాక్టికల్ నైపుణ్యాభివృద్ధిపై ప్రత్యేకంగా దృష్టి సారించాలన్నారు. శిక్షణలో మరింత నాణ్యతగా బోధించాలని అధికారులు, ఇన్‌స్ట్రక్టర్లను ఆదేశించారు. ఈ కార్యక్రమంలో ఐటీఐ ప్రిన్సిపాల్ జగన్‌మోహన్‌రెడ్డి, వాజేడు ప్రిన్సిపాల్ శేఖర్, ఎంపీడీఓ శ్రీనివాస్, తహసీల్దార్ జగదీష్, మువిన్ తదితరులు పాల్గొన్నారు.
కలెక్టరేట్‌లో కొమురంభీం వర్ధంతి
ములుగు రూరల్: కొమురం భీం వర్ధంతి వేడుకలను జిల్లా కలెక్టర్ కార్యాలయంలో ఘనంగా నిర్వహించారు. ఈ మేరకు మంగళవారం కలెక్టర్ టీఎస్ దివాకర కొమురం భీం చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కొమురంభీం ఆశయాలను కొనసాగించాలన్నారు. ఈ కార్యక్రమంలో అదనపు కలెక్టర్ మహేందర్‌జీ, డిప్యూటీ కలెక్టర్ కుశీల్ వంశీ, కలెక్టరేట్ ఏఓ రాజ్‌కుమార్, పర్యవేక్షలు మహేష్‌బాబు, సిబ్బంది పాల్గొన్నారు.
కలెక్టర్ దివాకర

ఏటీసీలను సద్వినియోగం చేసుకోవాలి