నిబంధనల మేరకు ధాన్యం కొనుగోళ్లు
ఏటూరునాగారం: నిబంధనల మేరకు ధాన్యం కొనుగోళ్లు పక్కాగా చేపట్టాలని కలెక్టర్ దివాకర అన్నారు. మంగళవారం మండల కేంద్రంలోని రైతువేదికలో ఏటూరునాగారం, కన్నాయిగూడెం, మంగపేట, వాజేడు, వెంకటాపురం(కె), తాడ్వాయి, గోవిందరావుపేట మండలాల్లోని కొనుగోలు కేంద్రాల నిర్వాహకులు, అధికారులతో సమీక్ష సమావేశం, అవగాహన సదస్సు నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ షెడ్యూల్ ప్రకారం నాణ్యమైన ధాన్యాన్ని రైతులు కొనుగోలు కేంద్రాలకు తీసుకొని రావాలన్నారు. జిల్లాలో దాదాపు 1.5 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం కొనుగోలు లక్ష్యంగా 175 కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేస్తున్నట్లు తెలిపారు. కార్యక్రమంలో అడిషనల్ కలెక్టర్ మహేందర్‌జీ, డీఆర్‌డీఓ శ్రీనివాస్, జిల్లా పౌరసరఫరాల అధికారి షా ఫైజల్ హుస్సేని, సివిల్ సప్లయీస్ కార్పొరేషన్ జిల్లా మేనేజర్ రాంపతి, జిల్లా సహకార అధికారి సర్దార్‌సింగ్, అధికారులు పాల్గొన్నారు.
అవకతవకలకు పాల్పడితే కఠిన చర్యలు:
అదనపు కలెక్టర్ సీహెచ్ మహేందర్‌జీ
గోవిందరావుపేట/ఎస్‌ఎస్‌తాడ్వాయి: ధాన్యం కొ నుగోలు కేంద్రాల్లో అవకతవకలకు పాల్పడితే కఠిన చర్యలు తప్పవని అదనపు కలెక్టర్ సీహెచ్ మహేందర్‌జీ అన్నారు. మంగళవారం తాడ్వాయి రైతువేదికలో తాడ్వాయి, గోవిందరావుపేట మండలాల పరిధిలోని ధాన్యం కొనుగోలు కేంద్రాల నిర్వాహకులకు శిక్షణ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన ముఖ్యఅతిథిగా హాజరై మాట్లాడారు. అన్ని విభాగాల అధికారులు సమన్వయంతో రైతులకు ఇబ్బందులు లేకుండా పకడ్బందీ చర్యలు చేపట్టాలన్నారు. కేంద్రాల్లో గన్నీ సంచులు అవసరానికి అనుగుణంగా సిద్ధం చేసుకోవాలన్నారు. ధాన్యం కొనుగోలు సెంటర్‌లో కనీస వసతులు మంచినీరు, టెంట్, ఫస్ట్ ఎయిడ్ కిట్స్ అందుబాటులో ఉండేలా చూసుకోవాలన్నారు. ట్యాబ్ ఎంట్రీ ప్రతీ రోజు చేయాలని, కొనుగోలు చేసిన ధాన్యాన్ని వెంటనే రైస్ మిల్లులకు పంపే విధంగా ప్రణాళిక ప్రకారం లారీలను, హమాలీలను సిద్ధంగా ఉంచుకునేలా చర్యలు తీసుకోవాలన్నారు. ఈ సమావేశంలో డీఆర్‌డీఓ శ్రీనివాస రావు, జిల్లా పౌర సరఫరా శాఖ అధికారి ఫైజల్ హుస్సేనీ, సివిల్ సప్లయీస్ కార్పొరేషన్ మేనేజర్ రాంపతి, జిల్లా సహకార అ ధికారి సర్దార్ సింగ్, అధికారులు పాల్గొన్నారు.
జిల్లాలో 175 కొనుగోలు కేంద్రాలు
కలెక్టర్ టీఎస్ దివాకర


