బ్యాంకులో బుస్‌..బుస్‌ | - | Sakshi
Sakshi News home page

బ్యాంకులో బుస్‌..బుస్‌

Oct 8 2025 6:11 AM | Updated on Oct 8 2025 6:11 AM

బ్యాంకులో బుస్‌..బుస్‌

బ్యాంకులో బుస్‌..బుస్‌

మంగపేట: మండలకేంద్రంలోని యూనియన్‌ బ్యాంకులో పాము కలకలం సృష్టించిన ఘటన మంగళవారం చోటుచేసుకుంది. మండలకేంద్రంలోని యూనియన్‌ బ్యాంకు సిబ్బంది రోజు వారీగా ఉదయం 10 గంటలకు విధులకు హాజరయ్యారు. ఈ క్రమంలో ఉద్యోగి బాలరాజు ఓచర్లు తీస్తున్న క్రమంలో పక్కనే పాము (జర్రిపోతు) కనిపించడంతో భయాందోళనకు గురయ్యాడు. విషయాన్ని సిబ్బందికి చెప్పి అందరూ బ్యాంకు నుంచి బయటకు వచ్చారు. బ్యాంకు పనిపై వచ్చిన వారిని లోపలికి వెళ్లకుండా తలుపులు వేసి మేనేజర్‌కు స మాచారం ఇచ్చారు. ఆయన వెంటనే గ్రామానికి చెందిన యాకూబ్‌ పాషా (పాములపాష)కు సమాచారం అందించగా.. పాషా వచ్చి పామును పట్టి బయట వదిలేశాడు. దీంతో సిబ్బంది, వినియోగదారులు ఊపిరి పీల్చుకున్నారు. ఈ ఘటనతో గంట పాటు బ్యాంకు సేవలు నిలిచిపోయాయి.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement