
పంటలు వర్షార్పణం
కొల్చారం(నర్సాపూర్): రెండు రోజులుగా మండలంలో భిన్నమైన వాతావరణ పరిస్థితులు కనిపిస్తున్నాయి. పగలంతా ఎండ కాస్తూ రాత్రి వర్షం పడుతోంది. ఆదివారం, సోమవారం 16 గంటల వ్యవధిలో 65.3 మి.మీ వర్షపాతం నమోదైంది. ఇప్పటికే ఎడతెరిపి లేని వర్షాలతో మండలవ్యాప్తంగా పత్తి, వరి పంటలు తీవ్రంగా దెబ్బతి న్నాయి. వాతావరణంలో తేమశాతం పెరగడం, దీనికి తోడు వర్షాలు కురుస్తుండటంతో చేన్లు తెగుళ్ల భారిన పడుతున్నాయి. మరో 15 రోజుల్లో పంట చేతికొచ్చి దశలో కొన్నిచోట్ల వరిలో కాండం కుళ్లు తెగులు సోకి పంట నేలవాలుతోంది. అటు పత్తికి సైతం ఇదే పరిస్థితి ఉంది. ఇలాగే కొనసాగితే పత్తి రంగు మారి, దిగుబడి తగ్గి పెట్టుబడి కూడా రాని పరిస్థితులు నెలకొంటాయని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

పంటలు వర్షార్పణం