
సమర్థవంతంగా ఎన్నికల విధులు
కలెక్టర్ రాహుల్‌రాజ్
మెదక్ కలెక్టరేట్/తూప్రాన్/మనోహరాబాద్(తూప్రాన్): స్థానిక ఎన్నికలు పూర్తిగా పారదర్శకంగా, సమర్థవంతంగా నిర్వహించేలా అధికారులంతా పనిచేయాలని కలెక్టర్ రాహుల్‌రాజ్ సూచించారు. సోమ వారం కలెక్టరేట్‌లో అధికారులకు శిక్షణ కార్యక్రమం నిర్వహించారు. ఈసందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ఎన్నికల ప్రక్రియలో అన్ని అంశాలపై సమగ్రమైన అవగాహన కలిగి ఉండాలన్నారు. నామినేషన్ నుంచి లెక్కింపు వరకు సిబ్బంది అప్రమత్తంగా ఉండాలని తెలిపారు. కార్యక్రమంలో అదనపు కలెక్టర్ నగేశ్, డీఆర్‌ఓ భుజంగరావు, జెడ్పీ సీఈఓ ఎల్లయ్య, డీఆర్డీఓ పీడీ శ్రీనివాస్‌రావు, డీపీఓ యా దయ్య, డీఈఓ రాధాకిషన్, ఆర్డీఓలు రమాదేవి, మహిపాల్‌రెడ్డి, జయచంద్రారెడ్డి, జిల్లా సైన్స్ అధి కారి రాజిరెడ్డి తదితరులు పాల్గొన్నారు. అలాగే తూప్రాన్ మండలంలోని లింగారెడ్డిపేట సమీపంలోని ఓ ప్రైవేట్ కళాశాలలో నిర్వహించనున్న కౌంటింగ్ కేంద్రాన్ని కలెక్టర్ రాహుల్‌రాజ్ పరిశీలించారు.
రేపు జిల్లాలో కేంద్ర బృందం పర్యటన
మెదక్ కలెక్టరేట్: వరద నష్టం అంచనా వేసేందుకు ఈనెల 8న జిల్లాలో కేంద్ర బృందం పర్యటించనున్నట్లు కలెక్టర్ రాహుల్‌రాజ్ సోమవారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు. జిల్లా పాలన యంత్రాంగం వరద నష్టంపై బృందం సభ్యులకు వివరించనున్నట్లు తెలిపారు. మెదక్, నిజాంపేట, రామాయంపేట, హవేళిఘణాపూర్, పాపన్నపేట మండలాల్లో పర్యటన కొనసాగుతుందన్నారు. అలాగే ఆర్టీఐ చట్టాన్ని సమర్థవంతంగా నిర్వహించాలని అధికారులను ఆదేశించారు.