
పారదర్శకంగా వ్యవహరించాలి
ఎస్పీ డీవీ శ్రీనివాసరావు
మెదక్ మున్సిపాలిటీ: స్థానిక సంస్థల ఎన్నికలు పూర్తి పారదర్శకంగా, శాంతి భద్రతల మధ్య సజావుగా జరిగేలా ప్రతి పోలీస్ అధికారి కృషి చేయాలని ఎస్పీ డీవీ శ్రీనివాసరావు సూచించారు. సోమవారం జిల్లా పోలీస్ కార్యాలయంలో పోలీస్ అధికారులకు ఎన్నికల నియమావళిపై అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ఈసందర్భంగా తూ ప్రాన్ ఆర్డీఓ జయచంద్రారెడ్డి నిబంధనలు ఉల్లంఘిస్తే తీసుకోవాల్సిన చర్యల గురించి అవగాహన కల్పించారు. అనంతరం ఎస్పీ మాట్లాడుతూ.. ప్రతి అధికారి తమ పరిధిలోని గ్రామాలను సందర్శించి పరిస్థితులను అవగాహన చేసుకోవాలన్నారు. ఎలాంటి ఘర్షణలకు తావు ఇవ్వకుండా ముందస్తు చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. ప్రతి పోలీస్‌స్టేషన్ పరిధిలో వాహన తనిఖీలు కఠినంగా నిర్వహించి అక్రమ రవాణా, అసాంఘిక చర్యలను అరికట్టాలని వివరించారు. కార్యక్రమంలో అదనపు ఎస్పీ మహేందర్, డీఎస్పీలు ప్రసన్నకుమార్, నరేందర్‌గౌడ్, రంగానాయక్, సీఐలు సందీప్‌రెడ్డి, మధుసూదన్‌గౌడ్, జాన్‌రెడ్డి, రంగాకృష్ణ తదితరులు పాల్గొన్నారు.