
విద్యా ప్రమాణాలు మెరుగుపర్చాలి
డీఈఓ రాధాకిషన్
చేగుంట(తూప్రాన్): విద్యార్థులు అన్ని సబ్జెక్టుల్లో రాణించేలా ప్రధానోపాధ్యాయులు చొరవ చూపా లని డీఈఓ రాధాకిషన్ అన్నారు. సోమవారం మండల కేంద్రంలోని ఉన్నత పాఠశాలలో హెచ్‌ఎంలతో సమావేశం నిర్వహించారు. ఈసందర్భంగా డీఈఓ మాట్లాడుతూ.. అన్ని పాఠశాలల్లో ఎక్కువ శాతం విద్యార్థులు బాగా చదివేలా చూడాలని తెలిపారు. ఉపాధ్యాయులకు ప్రత్యేక బాధ్యతలను అప్పగించి విద్యా ప్రమాణాల మెరుగు కోసం పని చేయాలన్నారు. విద్యాపరమైన విషయంలో మెదక్ జిల్లా ముందు వరుసలో ఉండేలా కృషి చేయాలన్నారు. పదోతరగతి ఫలితాల్లో సైతం మంచి మార్కులు సాధించేందుకు విద్యార్థులకు ప్రత్యేక తరగతులు నిర్వహించాలని ఆదేశించారు. కార్యక్రమంలో ఎంఈఓ నీరజ, పాఠశాలల ప్రధానోపాధ్యాయులు పాల్గొన్నారు.