డీజీపీని కలిసిన ఎస్పీ | - | Sakshi
Sakshi News home page

డీజీపీని కలిసిన ఎస్పీ

Oct 5 2025 8:56 AM | Updated on Oct 5 2025 8:56 AM

డీజీప

డీజీపీని కలిసిన ఎస్పీ

మెదక్‌ మున్సిపాలిటీ: నూతన డీజీపీగా బాధ్యతలు చేపట్టిన శివధర్‌రెడ్డిని జిల్లా ఎస్పీ డీవీ శ్రీనివాసరావు శనివారం మర్యాదపూర్వకంగా కలిశారు. ఈసందర్భంగా పూల మొక్క అందించి శుభాకాంక్షలు తెలిపారు. జిల్లాలో శాంతి భద్రతలు, నేర నియంత్రణ, నేర నిరోధక చర్య లు, పోలీస్‌ విభాగం పనితీరుపై ఆయనతో చర్చించారు.

జోరు తగ్గిన మంజీరా

పాపన్నపేట(మెదక్‌): ఏడుపాయల్లో శనివారం మంజీరా నది జోరు తగ్గింది. సింగూరు నుంచి 38,467 క్యూసెక్కుల నీరు వదలగా, గతంలో పోలిస్తే ప్రవాహం తక్కువగా కనిపిస్తోంది. అయినప్పటికీ రాజగోపురంలోనే దుర్గమ్మ తల్లికి పూజలు నిర్వహిస్తున్నారు.

వైద్య సేవలపై ఆరా

చిన్నశంకరంపేట(మెదక్‌): నార్సింగి మండల కేంద్రంలోని పల్లె దవాఖానను దుబ్బాక ఎమ్మెల్యే కొత్త ప్రభాకర్‌రెడ్డి శనివారం ఆకస్మికంగా తనిఖీ చేసి రికార్డులు పరిశీలించారు. స్టాఫ్‌నర్స్‌ రేణుకతో మాట్లాడి మందుల వివరాలు అడిగి తెలుసుకున్నారు. వైద్య సేవలపై ఆరా తీశారు. ఆయన వెంట ఎస్సీ, ఎస్టీ కమిషన్‌ చైర్మన్‌ బక్కి వెంకటయ్య, మాజీ జెడ్పీటీసీ కృష్ణారెడ్డి, బీఆర్‌ఎస్‌ మండల అధ్యక్షుడు బాబు, పట్టణ అధ్యక్షుడు విష్ణువర్ధన్‌రెడ్డి తదితరులు ఉన్నారు. అనంతరం బాధిత కుటుంబాలను పరామర్శించారు.

విద్యా సామర్థ్యాలు పెంచాలి

వెల్దుర్తి(తూప్రాన్‌): ప్రాథమిక దశ నుంచే విద్యా సామర్థ్యాలు పెంచడానికి ఉపాధ్యాయులు కృషి చేయాలని డీఈఓ రాధాకిషన్‌ సూచించారు. శనివారం మండలంలోని శంశిరెడ్డిపల్లితండా, చెర్లపల్లి ప్రాథమిక పాఠశాలలను ఆకస్మికంగా తనిఖీ చేశారు. పాఠశాల నిర్వహణ, మధ్యా హ్న భోజన పథకం, పరిసరాలు, రికార్డులు పరిశీలించి సంతృప్తి వ్యక్తం చేశారు. విద్యార్థుల రీడింగ్‌ సామర్థ్యాలను పరిశీలించి సిబ్బంది పనితీరును అభినందించారు. అదేవిధంగా ఎంఆర్‌సీ కార్యాలయాన్ని సందర్శించి రికార్డులు పరిశీలించారు. పాఠశాలల వారీగా సమీక్ష నిర్వహించి, ప్రభుత్వ బడుల్లో విద్యా ప్రమాణాల మెరుగకు తీసుకోవాల్సిన చర్యలను వివరించారు. ఆయన వెంట ఎంఈఓ సీతారాం ఉన్నారు.

బీజేపీకే ప్రజాదరణ

నర్సాపూర్‌: జిల్లాలో బీజేపీకే ప్రజాదరణ ఉందని ఆపార్టీ జిల్లా అధ్యక్షుడు మల్లేశ్‌గౌడ్‌ అన్నారు. శనివారం పార్టీ కార్యాలయంలో మండల శాఖ అధ్యక్షుడు నగేశ్‌ అధ్యక్షతన నిర్వహించిన స్థానిక సంస్థల ఎన్నికల సన్నాహక సమావేశంలో పాల్గొని మాట్లాడారు. ప్రధాని నరేంద్ర మోదీ చేపడుతున్న సంక్షేమ, అభివృద్ధి పథకాలకు ప్రజలు ఆకర్షితులవుతున్నారని తెలిపారు. స్థానిక ఎన్నికల్లో వార్డు మెంబర్‌ నుంచి జెడ్పీటీసీ వరకు అన్ని స్థానాలను కై వసం చేసుకుంటామని ధీమా వ్యక్తం చేశారు. బీఆర్‌ఎస్‌, కాంగ్రెస్‌ పార్టీలు ప్రజలను మోసం చేశాయని, వారి మోసాలను ప్రజలకు వివరించాలని కార్యకర్తలకు సూచించారు. సమావేశంలో పార్టీ ఓబీసీ మోర్చా రాష్ట్ర ఉపాధ్యక్షుడు రమేశ్‌గౌడ్‌, నాయకులు నారాయణరెడ్డి, రాములునాయక్‌, రాంరెడ్డి తదితరులు పాల్గొన్నారు.

డీజీపీని కలిసిన ఎస్పీ 1
1/2

డీజీపీని కలిసిన ఎస్పీ

డీజీపీని కలిసిన ఎస్పీ 2
2/2

డీజీపీని కలిసిన ఎస్పీ

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement