
ఓట్లడిగే హక్కు ఆ పార్టీలకు లేదు
బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు రామచందర్‌రావు
జోగిపేట(అందోల్): స్థానిక సంస్థల ఎన్నికల్లో మెజార్టీ సీట్లను గెలుచుకొని ప్రధాని మోదీకి గిఫ్ట్‌గా ఇస్తామని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు రాంచందర్‌రావు ప్రకటించారు. ఆదివారం అందోలులో నిర్వహించిన అలయ్– బలయ్ కార్యక్రమానికి హాజరై మాట్లాడారు. బీఆర్‌ఎస్, కాంగ్రెస్ పార్టీలకు ఎన్నికల్లో ఓట్లు అడిగే నైతిక హక్కు లేదన్నారు. ప్రజల్లో బీజేపీ పార్టీకి ఆదరణ ఉందన్నారు. ఎక్కడికి వెళ్లినా తమ పార్టీకి బ్రహ్మరథం పడుతున్నారన్నారు. కార్యకర్తల ఉత్సా హం చూస్తుంటే సంగారెడ్డి జిల్లా పరిషత్ చైర్మన్‌్ పదవిని బీజేపీ కై వసం చేసుకోవడం ఖాయమని అన్నారు. ఎప్పుడు ఎన్నికలు వచ్చినా కార్యకర్తలు, నాయకులు సిద్ధంగా ఉండాలన్నారు. కాంగ్రెస్ మోసపూరిత విధానాలను ప్రజల్లోకి తీసుకువెళ్లాలని సూచించారు. గత పదేళ్ల బీఆర్‌ఎస్ ప్రభుత్వ పనితీరును కూడా ఎండగట్టాలని పిలుపునిచ్చారు. కార్యకర్తలంతా ఐకమత్యంగా ఉండి స్థానిక సంస్థల ఎన్నికలను ఎదుర్కోవాలన్నారు. కార్యక్రమంలో ఎమ్మెల్సీ అంజిరెడ్డి, జిల్లా అధ్యక్షురాలు గోదావరి, సంగారెడ్డి, నారాయణఖేడ్ అసెంబ్లీ ఇన్‌చార్జిలు దేశ్‌పాండే, సంగప్ప, నాయకులు అనంతరావు కులకర్ణి, ప్రభాకర్‌గౌడ్, లక్ష్మినర్సింహ రెడ్డి, వివిధ మండల శాఖల అధ్యక్షులు, కార్యకర్తలు పాల్గొన్నారు.