
పేటలో పోటీ.. జెడ్పీ పీఠంపై గురి
రామాయంపేట(మెదక్): జిల్లా పరిషత్ చైర్మన్ స్థానం జనరల్‌కు కేటాయించడంతో ఈ స్థానాన్ని కై వసం చేసుకోవడానికి ప్రధాన పా ర్టీలు తీవ్ర స్థాయిలో ప్రయత్నాలు చేస్తున్నాయి. జిల్లాలోని 21 జెడ్పీటీసీ స్థానాల్లో రామాయంపేట, కొల్చారం,తూప్రాన్ స్థానాలు జనరల్, నిజాంపేట, పెద్దశంకరంపేట, మనోహరాబాద్ జెడ్పీటీసీ స్థానాలు జనరల్ మహిళలకు కేటాయించారు. మూడు ప్రధాన పార్టీల్లో మాజీ ఎమ్మెల్యేలు, ప్రస్తుత, మాజీ జిల్లా అధ్యక్షులు, గుర్తింపు పొందిన నేతలు ఇప్పటినుంచే ప్రయత్నాలు ప్రారంభించారు. జెడ్పీటీసీగా గెలిస్తే చాలు ఎలాగైనా జెడ్పీ పీఠం కై వసం చేసుకోవచ్చనే ఆలోచనలో ఉన్న నాయకులు తమ వంతు ప్రయత్నాలు ప్రారంభించారు. రామాయంపేటలో పోటీ చేయడానికి బీఆర్‌ఎస్ జిల్లా అధ్యక్షురాలు పద్మ భర్త దేవేందర్‌రెడ్డి, మాజీ ఎమ్మెల్యే శశిధర్‌రెడ్డి, మెదక్ నియోజవర్గ ఇన్‌చార్జి కంఠారెడ్డి తిరుపతిరెడ్డి మాజీ మంత్రి హరీశ్‌రావు ద్వారా ప్రయత్నాలు కొనసాగిస్తున్నట్లు సమాచారం. కాంగ్రెస్‌లో ఆర్ వెంకటాపూర్ మాజీ సర్పంచ్ మహేందర్‌రెడ్డి, ఇటీవల పార్టీలో చేరిన మోహన్‌నాయక్, దామరచెరువు మాజీ సర్పంచ్ శివప్రసాదరావు ప్రయత్నాలు చేస్తున్నారు. బీజేపీ నుంచి పార్టీ రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు రాగి రాములుతో పాటు మరికొందరు టికెట్ ఆశి స్తున్నారు. తమ మండలాల్లో రిజర్వేషన్లతో పోటీ చేయడానికి అవకా శం లేని నాయకులు పక్క మండలాలపై దృష్టి సారిస్తున్నారు. కాగా జెడ్పీటీసీ ఎన్నికలను ప్రతిష్టాత్మకంగా తీసుకుంటున్న ప్రధాన పార్టీ ల అభ్యర్థుల ఎంపిక విషయమై జాగ్రత్త పడుతున్నట్లు తెలిసింది.