
నిబంధనలు తప్పనిసరిగా పాటించాలి
హెల్ప్‌డెస్క్ ద్వారా ప్రజావాణి
కలెక్టర్ రాహుల్‌రాజ్
మెదక్ కలెక్టరేట్: స్థానిక సంస్థల ఎన్నికల్లో పోటీ చేసే అభ్యర్థులు ఎంసీఎంసీ (మీడియా సర్టిఫికేషన్ అండ్ మానిటరింగ్ కమిటీ) నిబంధనలు తప్పనిసరిగా పాటించాలని కలెక్టర్, జిల్లా ఎన్నికల అధికారి రాహుల్‌రాజ్ అన్నారు. శనివారం కలెక్టరేట్‌లో జిల్లా సమాచార, పౌర సంబంధాల శాఖ కార్యాలయంలో ఎంసీఎంసీ కేంద్రాన్ని ప్రారంభించారు. ఈసందర్భంగా ఎంసీఎంసీ ద్వారా చేపడుతున్న పనుల వివరాలను అడిగి తెలుసుకున్నారు. అనంతరం పలు రికార్డులను తనిఖీ చేశారు. కలెక్టరేట్‌లో ఏర్పాటు చేసిన ఎన్నికల కంట్రోల్ రూంను పరిశీలించారు. అభ్యర్థులు తమ ఎన్నికల ప్రకటనల కోసం ఎంసీఎంసీ ద్వారా అనుమతి పొందాలన్నారు. కార్యక్రమంలో అదనపు కలెక్టర్ నగేశ్, జెడ్పీ సీఈఓ ఎల్లయ్య, జిల్లా పంచా యతీ అధికారి యాదయ్య, జిల్లా పౌర సంబంధాల అధికారి రామచంద్రరాజు తదితరులు పాల్గొన్నారు.
మరమ్మతులు త్వరగా పూర్తి చేయాలి
రామాయంపేట/నిజాంపేట(మెదక్): ఇటీవల కురిసిన భారీ వర్షాలకు దెబ్బతిన్న రోడ్డు వంతెనలు, చెరువుల తాత్కాలిక మరమ్మతు పనులు త్వరితగతిన పూర్తి చేయాలని కలెక్టర్ రాహుల్‌రాజ్ అధికారులను ఆదేశించారు. శనివారం రామాయంపేట, నిజాంపేట మండలాల్లో పర్యటించారు.
మెదక్ కలెక్టరేట్: స్థానిక ఎన్నికల నేపథ్యంలో కలెక్టరేట్‌లో నిర్వహించే ప్రజావాణి హెల్ప్‌డెస్క్ ద్వారా నిర్వహించనున్నట్లు కలెక్టర్ రాహుల్‌రాజ్ పేర్కొన్నారు.