
బ్రహ్మోత్సవాలకు ముస్తాబు
పేదల తిరుపతిగా పేరుగాంచిన అమ్మాపురం కురుమూర్తిస్వామి బ్రహ్మోత్సవాలకు ఆలయం ముస్తాబవుతోంది. ఈ నెల 20 నుంచి బ్రహ్మోత్సవాలు, జాతర ప్రారంభం కానున్న నేపథ్యంలో ఆలయానికి రంగులు వేయడం, చుట్టుపక్కల పిచ్చిమొక్కలు, ముళ్లపొదలు తొలగించడం లాంటి పనులు సోమవారం చేపట్టారు. అలాగే, ఆలయ మెట్ల వద్ద ఉన్న రాజగోపురం, మెట్లు, క్యూలైన్ రాడ్లు తదితర వాటికి రంగులు అద్దే పనుల్లో కూలీలు నిమగ్నమయ్యారు. జాతర మైదానంలో దుకాణ సముదాయాలు, పిల్లల ఆహ్లాదం కోసం రంగుల రాట్నం, తదితర వాటిని ఏర్పాటు చేసే పనిలో ఆయా నిర్వాహకులు నిమగ్నమయ్యారు. – చిన్నచింతకుంట

బ్రహ్మోత్సవాలకు ముస్తాబు

బ్రహ్మోత్సవాలకు ముస్తాబు