
4 కిలోల గంజాయి పట్టివేత
వనపర్తి రూరల్: ఓ వ్యక్తి నుంచి 4 కిలోల గంజాయి స్వాధీనం చేసుకున్న ఘటన పెబ్బేరు పట్టణంలో సోమవారం చోటుచేసుకుంది. ఎస్‌ఐ యుగేంధర్‌రెడ్డి తెలిపిన వివరాలిలా.. హైదరాబాద్ నుంచి బెంగళూరుకు ఓ వ్యక్తి బస్సులో గంజాయి తరలిస్తున్నారని సమాచారం రావడంతో పోలీసులు బస్టాండ్‌కు చేరుకున్నారు. అక్కడ అనుమానాస్పదంగా తిరుగుతున్న మల్లేష్ ప్రభుని అదుపులోకి తీసుకొని అతని వద్ద ఉన్న బ్యాగును పరిశీలించగా 4 కిలోల గంజాయి ప్యాకెట్ కనిపించింది. దానిని స్వాధీనం చేసుకొని అతన్ని విచారించగా.. స్వస్థలం కర్ణాటక రాష్ట్రం బెంగళూరు అని, స్నేహితుడు దిలీప్ కాలేతో కలిసి ఒడిషాలోని మోహన్, అర్జున్ వ్యక్తుల నుంచి గంజాయి కొనుగోలు చేశామని తెలిపారు. బెంగళూరులో ఎక్కువ రేటుకు విక్రయించేవాళ్లమని వివరించారు. అయితే, తన స్నేహితుడు దిలీప్‌కాలే పని ఉండడంతో మార్గమధ్యలో దిగిపోవడంతో బస్సులో తాను ఒక్కడినే వచ్చానని తెలిపారు. గంజాయిని స్వాధీనం చేసుకొని కేసు నమోదు చేశామని ఎస్‌ఐ యుగేంధర్‌రెడ్డి తెలిపారు.