
రోడ్డు ప్రమాదంలో ఇద్దరు దుర్మణం
● అదుపుతప్పి లారీ కిందపడిన బైక్
చారకొండ: బైక్ అదుపుతప్పి లారీ కిందపడిన ఘటనలో ఇద్దరు వ్యక్తులు మృతి చెందిన ఘటన దేవరకొండ మండలం కొండభీమనపల్లి శివారులో సోమవారం జరిగింది. పూర్తి వివరాలు.. మండల కేంద్రానికి చెందిన కోట్ర శివ(28) బైక్‌పై నల్లగొండ జిల్లా దేవరకొండకు వెళ్లి తిరిగి వస్తుండగా దారిలో ఓ మహిళకు లిఫ్టు ఇచ్చాడు. ఈ క్రమంలో కొండభీమనపల్లి వద్ద ముందు వెళ్తున్న లారీ ఓవర్ టేక్ చేసే క్రమంలో ముందుగా వస్తున్న కారును తప్పించబోయి అదుపు తప్పి లారీ కింద పడింది. ప్రమాదంలో బైక్‌పై ఇద్దరు అక్కడికక్కడే మృతి చెందారు. మృతురాలి వివరాలు తెలియాల్సి ఉంది.