
అన్యాక్రాంత ఆలయ భూమి స్వాధీనం
లింగాల: ఏళ్ల తరబడి అన్యాక్రాంతంగా ఉన్న ఆలయ భూమిని పోలీసు బందోబస్తు నడుమ ఆలయ అధికారులు సోమవారం స్వాధీనం చేసుకున్నారు. మండల పరిధిలోని కోమటికుంట ఆంజనేయస్వామి ఆలయానికి చెందిన సర్వే నంబర్–165లో 12.35 ఎకరాల భూమిని కొన్నేళ్లుగా కొందరు అక్రమంగా సాగు చేసుకుంటున్నారు. ఆలయానికి ఎలాంటి ఆదాయం సమకూరకపోవడంతో దేవాలయ కమిటీ భూమి ఆక్రమణకు గురైందని హైకోర్టును ఆశ్రయించారు. కోర్టు దేవాలయ కమిటీకి అనుకూలంగా తీర్పు ఇవ్వడంతో కోర్టు ఆదేశాల మేరకు అచ్చంపేట సీఐ నాగరాజు పర్యవేక్షణలో ఎస్‌ఐ వెంకటేశ్వర్‌గౌడ్ ఆధ్వర్యంలో పోలీసుల బందోబస్తు నడుమ ఆక్రమణకు గురైన భూమిని స్వాధీనం చేసుకున్నారు.