
షెడ్డులోకి దూసుకెళ్లిన డీసీఎం.. ఇద్దరికి గాయాలు
ఉండవెల్లి: మండలంలోని జాతీయ రహదారిపై ప్రయాణిస్తున్న డీసీఎం వాహనం అదుపుతప్పి ఓ రేకుల షెడ్డులోకి దూసుకెళ్లడంతో భార్యాభర్తకు తీవ్ర గాయాలైన ఘటన సోమవారం జరిగింది. కడప జిల్లా ఒంటిమిట్ట నుంచి హైదరాబాద్‌కు వెళ్తున్న డీసీఎం వాహనం ఉండవెల్లి శివారులోకి రాగానే పత్తి మిల్లు ముందు ఉన్న షెడ్డులోకి దూసుకెళ్లింది. ఈ ప్రమాదంలో షెడ్డులో ఉన్న వీరా సింగ్, భాగ్యమతి దంపతులకు తీవ్ర గాయాలు కాగా కర్నూలు ఆస్పత్రికి తరలించారు. డ్రైవర్ శ్రీశైలం నిద్రమత్తులో వాహనం నడపడంతోనే ప్రమాదానికి కారణమని స్థానికులు తెలిపారు. పోలీసులు ఘటనా స్థలాన్ని పరిశీలించారు. ఏలాంటి ఫిర్యాదు అందలేదని ఎస్‌ఐ శేఖర్ పేర్కొన్నారు.