
తాగేందుకు డబ్బులు ఇవ్వలేదని వ్యక్తి ఆత్మహత్య
గోపాల్‌పేట: తాగింది సరిపోలేదని ఇంకా తాగేందుకు డబ్బులు అడిగితే భార్య డబ్బులు ఇవ్వలేదన్న మనస్తాపంతో వ్యక్తి ఆత్మహత్య చేసుకున్న ఘటన వనపర్తి జిల్లా గోపాల్‌పేట మండలంలోని తాడిపర్తిలో సోమవారం చోటుచేసుకుంది. గోపాల్‌పేట ఎస్సై నరేశ్‌కుమార్ కథనం ప్రకారం.. మండలంలోని తాడిపర్తికి చెందిన పిచ్చుకుంట్ల రాముడు(40) సువర్ణ దంపతులు. కొంతకాలంగా రాముడు మద్యానికి బానిసయ్యాడు. ఇదేక్రమంలో ఆదివారం రాత్రి తాగాడు.. ఇంకా తాగేందుకు డబ్బులు కావాలని భార్యను అడిగాడు. భార్య డబ్బులు ఇవ్వకపోవడంతో భార్యతో గొడవపడ్డాడు. ఆ తర్వాత అందరూ పడుకున్నాక ఎవరికీ చెప్పకుండా ఇంటినుంచి బయటకు వెళ్లిపోయి తాడిపర్తి చెరువులో పడ్డాడు. ఉదయం చెరువు వైపు వెళ్లిన గ్రామస్తులు చెరువు కట్టపై చెప్పులు, బట్టలు కనిపించడంతో కుటుంబ సభ్యులకు సమాచారం అందించారు. కుటుంబ సభ్యులు పోలీసులకు సమాచారం అందించి చెరువులో వెతకగా రాముడు బాడీ కనిపించింది. బయటకు తీసి భార్య సువర్ణ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టినట్లు ఎస్సై తెలిపారు.
వ్యక్తి మృతిపై కేసు నమోదు
మండలంలోని ఏదుట్లలో పాన్‌గల్ మండలంలోని కేతేపల్లికి చెందిన ఎడ్జ్ రాజ్‌కుమార్, ఏదుట్లకు చెందిన సంకెండ్ల పరశురాముడు, సూగూరు సాయి ముగ్గురు కలిసి వ్యవసాయం చేస్తున్నారు. ఇదేక్రమంలో ఆదివారం ఎడ్జ్ రాజ్‌కుమార్, సంకెండ్ల పరశురామ్ కలిసి రోటవేటర్ ట్రాక్టరుతో దున్నేందుకు పొలంవద్దకు వెళ్లారు. రాజ్‌కుమార్ రోటవేటర్‌ను సరిచేస్తుండగా పరశురాముడు అజాగ్రత్తగా ముందుకు నడిపాడు. దీంతో రాజ్‌కుమార్ రోటవేటర్‌లో పడి మృతిచెందాడు. సోమవారం బాధితుడి తండ్రి అగ్గిరాముడు ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపడుతున్నట్లు ఎస్‌ఐ నరేశ్‌కుమార్ తెలిపారు.