
ఊకచెట్టువాగులో మృతదేహం లభ్యం
మదనాపురం: సరళాసాగర్ ఊకచెట్టు వాగులో శుక్రవారం చేపల వేటకు వెళ్లిన శేఖర్ ప్రమాదవశాత్తూ నీటిలో పడి మృతి చెందాడు. శనివారం ఉదయం ఎన్టీఆర్‌ఎఫ్ అండ్ రెస్క్యూ బృందాలు వెలికితీసేందుకు చర్యలు చేపట్టగా ఎట్టకేలకు మృతదేహం లభ్యమైంది. అనంతరం పంచనామా నిర్వహించి మృతదేహాన్ని కుటుంబ సభ్యులకు అప్పగించినట్లు ఎస్‌ఐ శేఖర్‌రెడ్డి తెలిపారు.
బైకులపైకి దూసుకెళ్లిన ఆర్టీసీ బస్సు
వనపర్తిటౌన్: వనపర్తి ఆర్టీసీ బస్టాండ్‌లో ఆగి ఉన్న డీలక్స్ బస్సు అకస్మాత్తుగా ముందుకు కదలడంతో ప్ర యాణికులు తీవ్రభయాందోళనకు లోన య్యారు. ఓ డీలక్స్ బస్సు శనివారం ఉద యం హైదరాబాద్ వెళ్లేందుకు వనపర్తి ఆర్టీసీ బస్టాండ్‌లో ఆగింది. పలువురు ప్రయాణికులు ఎక్కగా డ్రైవర్ టికెట్‌లు ఇస్తుండగా బస్సు దానంతట అదే ముందుకు కదిలింది. ఈ క్రమంలో బస్సు ముందు ఉన్న ప్రయాణికులు ఒక్కసారిగా పరిగెత్తారు. దీంతో అక్కడే ఆగి ఉన్న రెండు బైకులపైకి బస్సు దూసుకెళ్లడంతో అవి ధ్వంసమయ్యాయి. డ్రైవర్ వెంటనే అప్రమత్తమై బస్సును అదుపు చేయడంతో ప్రాణాపాయం తప్పింది. బస్సులో సాంకేతిక కారణాల వల్లే ఇలా జరిగిందని ఆర్టీసీ సిబ్బంది చెబుతుండగా డిపో మేనేజర్ దేవేందర్ గౌడ్ డ్రైవర్ హ్యాండ్ బ్రేక్ వేయకపోవడంతోనే సమస్య తలెత్తిందని తెలిపారు. డ్రైవర్‌కు కౌన్సిలింగ్ ఇచ్చామని వాహనదారులు కూడా బస్టాండ్‌లో బైకులు ఆపడం సరికాదని సూచించారు. ఘటనపై పోలీసులు ఆరా తీసినట్లు డిపో అధికారులు తెలిపారు.