
ఇసుక తరలింపు గొడవలో రైతుపై దాడి
వీపనగండ్ల: మండలంలోని తూంకుంట గ్రామ సమీపంలోని ఇసుక రీచ్ నుంచి శనివారం సాయంత్రం అక్రమంగా ఇసుకను తరలిస్తున్న ట్రాక్టర్‌ను రైతు అడ్డగించి తన పంట పొలంలో వెళ్లొద్దని చెప్పడంతో ఆగ్రహించిన ట్రాక్టర్ యజమాని రైతుపై దాడి చేసి గాయపరిచిన ఘటన శనివారం చోటు చేసుకుంది. వివరాలు.. తూంకుంట గ్రామానికి చెందిన చిన్న రాంబాబు అనే ట్రాక్టర్ యజమాని అదే గ్రామానికి చెందిన పోతుల రామకృష్ణారెడ్డి పొలం నుంచి ఇసుకను తరలిస్తున్నాడు. దీంతో రైతు ట్రాక్టర్ అడ్డుకొని తన పొలం గుండా రావొద్దని చెప్పడంతో ఆగ్రహించిన ట్రా క్టర్ యజమాని రైతుపై దాడి చేసి గాయపరిచారు. ఇసుక రీచ్‌కు అతి సమీపంలో దాదా పు 100 మంది రైతుల మోటా ర్లు ఉన్నాయని, యథేచ్ఛగా ఇసుకను తరలిస్తుండడంతో బోరుబావులు అడుగంటి పోతాయన్న విషయాన్ని ఇసుక అక్రమ తరలింపుదారులకు చెప్పినా పట్టించుకోవడంలేదని బాధితుడు వాపోయారు. తనపై దాడి చేసిన వ్యక్తిపై చట్టరీత్యా చర్య తీసుకోవాలని స్థానిక పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేసినట్లు ఆయన తెలిపారు. ఫిర్యాదు అందుకున్న ఎస్‌ఐ కె.రాణి విచారణ చేసి కేసు నమోదు చేయనున్నట్లు తెలిపారు.