
పకడ్బందీగా ఎన్నికల కోడ్ అమలు
జెడ్పీసెంటర్ (మహబూబ్‌నగర్): స్థానిక సంస్థలైన జెడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికల షెడ్యూల్ వచ్చిన నేపథ్యంలో గ్రామాల్లో ఎన్నికల కోడ్‌ను పకడ్బందీగా అమలు చేయాలని అదనపు కలెక్టర్ మధుసూదన్‌నాయక్ అన్నారు. శనివారం ఆయన తన చాంబర్ నుంచి తహసీల్దార్లతో వీసీ నిర్వహించి మాట్లాడారు. ఎలాంటి పక్షపాతం లేకుండా పారదర్శకంగా కోడ్ అమలు చేయాలన్నారు. అనుమతి తీసుకున్నాకే సభలు, సమావేశాలు నిర్వహించాలని సూచించారు. రెవెన్యూ సదస్సులో వచ్చిన దరఖాస్తులను పెండింగ్‌లో పెట్టకుండా వెంటనే పరిష్కరించేందుకు చర్యలు తీసుకోవాలన్నారు. భారత్‌మాల రోడ్డు వెళ్లే మహబూబ్‌నగర్ రూరల్, దేవరకద్ర, చిన్నచింతకుంట మండలాల పరిధిలో భూ సేకరణ త్వరగా పూర్తిచేయాలని, ఇందుకోసం ఆయా మండలాల తహసీల్దార్లు చొరవ చూపాలనిఆదేశించారు.
● సీఎంఆర్ బియ్యం సరఫరాలో వేగం పెంచాలని అదనపు కలెక్టర్ మధుసూదన్‌నాయక్ అన్నారు. శనివారం తన చాంబర్‌లో రైస్ మిల్లర్లు, సంబంధిత అధికారులతో నిర్వహించిన సమావేశంలో ఆయన మాట్లాడారు. రేషన్ బియ్యం సరఫరా చేయడంలో నిర్లక్ష్యం వహించకుండా పారదర్శకంగా చేపట్టాలని సూచించారు.