
పోలీసు వాహనాలకు ఆయుధ పూజ
మహబూబ్‌నగర్ క్రైం: దుర్గాష్టమి సందర్భంగా జిల్లా పోలీస్‌శాఖ ఆధ్వర్యంలో పని చేస్తున్న అన్ని రకాల వాహనాలకు మంగళవారం పరేడ్ మైదానంలో వాహన పూజ నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ఎస్పీ డి.జానకి హాజరై వాహనాలకు పూజలు చేశారు. ఈ సందర్భంగా ఎస్పీ మాట్లాడుతూ వాహనాలు పోలీస్ విధి నిర్వహణలో ఒక భాగం మాత్రమే కాకుండా ప్రజల భద్రత కోసం మనతో పాటు నడిచే నమ్మకమైన సహచరులని తెలిపారు. ప్రతి వాహన డ్రైవర్ వాహనాన్ని కేవలం యంత్రంలా కాకుండా మన సేవా కార్యక్రమంలో భాగస్వామిగా భావించాలన్నారు. కార్యక్రమంలో అదనపు ఎస్పీలు ఎన్‌బీ రత్నం, సురేష్‌కుమార్, డీఎస్పీలు వెంకటేశ్వర్లు, రమణారెడ్డి, శ్రీనివాసులు, సీఐలు పాల్గొన్నారు.
● ప్రభుత్వ జనరల్ ఆస్పత్రిలో మంగళవారం అన్ని రకాల ఆపరేషన్ థియేటర్‌లలో ప్రత్యేకంగా ఆయుధ పూజలు నిర్వహించారు. జనరల్ ఆస్పత్రి సూపరింటెండెంట్ డాక్టర్ రంగా ఆజ్మీరాతో పాటు ఆయా విభాగాల హెచ్‌ఓడీలు పూజలో పాల్గొన్నా రు. అలాగే ఆస్పత్రి ఆవరణలో ఉన్న అమ్మవారి ఆలయంలో ప్రత్యేకంగా హోమం నిర్వహించారు.