
అమ్మవారి ఆశీస్సులు అందరిపై ఉండాలి : ఎంపీ
జోగుళాంబ అమ్మవారి అశీస్సులు అందరిపై ఉండాలని రాజ్యసభ సభ్యుడు అనిల్ యాదవ్ అన్నారు. అలంపూర్ క్షేత్ర ఆలయాలను రాజ్యసభ సభ్యుడు అనిల్ కుమార్ యాదవ్, గద్వాల సంస్థాన వారసుడు కృష్ణరామ్ భూపాల్‌తో కలిసి ఆదివారం దర్శించుకున్నారు. ఆలయ ఈఓ దీప్తి, ఆలయ పాలక మండలి సభ్యులు అర్చకులతో కలిసి స్వాగతం పలికారు. ఈమేరకు అమ్మవారికి పట్టువస్త్రాలను అందజేశారు. అనంతరం బాలబ్రహ్మేశ్వర స్వామి, జోగుళాంబ అమ్మవారిని దర్శించుకొని ప్రత్యేక పూజలు చేశారు. ఆలయ అధికారులు, పాలక మండలితో చర్చించి ఆలయాల అభివృద్ధికి తన వంతు సహకారం అందిస్తానన్నారు. అనంతరం ఆలయ అధికారులు వారిని శేషవస్త్రాలతో సత్కరించారు.