
కలెక్టరేట్‌లో బతుకమ్మ వేడుకలు
బతుకమ్మ ఆడుతున్న
మహిళ ఉద్యోగులు
కలెక్టరేట్‌లో ఆదివారం బతుకమ్మ వేడుకలు ఘనంగా నిర్వహించారు. డీపీఆర్‌ఓ, మెప్మా, అగ్నిమాపక శాఖ, ఎస్సీ కార్పొరేషన్, డిప్యూటీ ఎగ్జిక్యూటివ్
ఇన్ఫర్మేషన్ ఇంజినీరింగ్ శాఖల ఆధ్వర్యంలో
నిర్వహించిన కార్యక్రమంలో మహిళా ఉద్యోగులు, చిన్నారులు రంగురంగుల పూలతో బతుకమ్మలను పేర్చి పాటలు పాడుతూ.. కోలాటం వేస్తూ సందడి చేశారు. ప్రకృతికే అందం మన బతుకమ్మ
సంబురమని, సంస్కృతి, సంప్రదాయాలు ప్రతిబింబించేలా ఈ వేడుకలు నిర్వహిస్తున్నట్లు డీపీఆర్‌ఓ
శ్రీనివాస్ తెలిపారు. – జెడ్పీసెంటర్ (మహబూబ్‌నగర్)

కలెక్టరేట్‌లో బతుకమ్మ వేడుకలు