
జూరాలకు నిలకడగా వరద
ధరూరు: కర్ణాటక, మహారాష్ట్రలో కురిసిన భారీ వ ర్షాలతో ప్రియదర్శిని జూరాల ప్రాజెక్టుకు ఎగువ నుంచి వస్తున్న ఇన్‌ఫ్లో స్వల్పంగా తగ్గినట్లు పీజేపీ అధికారులు తెలిపారు. మంగళవారం రాత్రి 8గంటల వరకు ప్రాజెక్టుకు 3లక్షల 32వేల క్యూసెక్కుల ఇన్‌ఫ్లో ఉండగా.. బుధవారం రాత్రి 9 గంటల వర కు ప్రాజెక్టుకు వస్తున్న ఇన్‌ఫ్లోలు 2లక్షల 55వేల క్యూ సెక్కులకు తగ్గినట్లు పీజేపీ అధికారులు తెలిపారు. దీంతో ప్రాజెక్టు 32 క్రస్టు గేట్లను ఎత్తి గేట్ల ద్వారా 2లక్షల 21వేల 120 క్యూసెక్కుల వరద నీటిని దిగువకు విడుదల చేస్తున్నారు. జెన్‌కో జల విద్యుత్ కేంద్రంలో ఆరు యూనిట్లలో విద్యుదుత్ప త్తిని కొనసాగిస్తున్నట్లు అధికారులు తెలిపారు. విద్యుదుత్పత్తి నిమిత్తం 27వేల 927 క్యూసెక్కులు, నెట్టెపాడుకు 750 క్యూసెక్కులు, ఆవిరి రూపంలో 45 క్యూసెక్కులు, ఎడమ కాల్వకు 1,030 క్యూసెక్కులు, కుడి కాల్వకు 550 క్యూసెక్కులు, భీమా లిఫ్టు–2కు 750 క్యూసెక్కులు ప్రాజెక్టు నుంచి మొత్తం 2లక్షల 51వేల 422 క్యూసెక్కుల నీటిని దిగువనున్న శ్రీశైలం ప్రాజెక్టుకు విడుదల చేస్తున్నా రు. ప్రాజెక్టు పూర్తిస్థాయి నీటిమట్టం 9.657 టీఎంసీలు కాగా ప్రస్తుతం ప్రాజెక్టులో 8.377 టీఎంసీల నీరు నిల్వ ఉన్నట్లు పీజేపీ అధికారులు తెలిపారు. ఇదిలా ఉండగా.. ఆల్మట్టి ప్రాజెక్టుకు పూర్తిస్థాయి నీటిమట్టం 129.72 టీఎంసీలు కాగా.. ప్రస్తుతం ఈ ప్రాజె క్టులో పూర్తిస్థాయిలో 126.73 టీఎంసీల నీరు నిల్వ ఉంది. ప్రాజెక్టుకు 37,098 క్యూసెక్కుల ఇన్ ఫ్లో ఉండగా.. ప్రాజెక్టు నుంచి దిగువన ఉన్న నారాయణపూర్ ప్రాజెక్టుకు 39వేల 135 క్యూసెక్కుల నీటిని దిగువకు విడుదల చేస్తున్నారు. నారాయణపూర్ ప్రాజెక్టుకు పూ ర్తిస్థాయి నీటిమట్టం 37.64 టీఎంసీలు కాగా.. ప్రస్తు తం ఈ ప్రాజెక్టులో 37.51 టీఎంసీల నీరు నిల్వ ఉంది. ప్రాజెక్టుకు 46వేల 167 క్యూసెక్కుల ఇన్‌ఫ్లో ఉండగా.. దిగువనున్న జూరాలకు ప్రాజెక్టుకు లక్షా 45,075 క్యూసెక్కుల నీటిని దగువకు విడుదల చేస్తున్నారు.
732.426 ఎంయూ విద్యుదుత్పత్తి
ఆత్మకూర్: జూరాలకు ఎగువ నుంచి వరదనీరు భా రీగా చేరుతుండడంతో జలవిద్యుదుత్పత్తి కేంద్రాల్లో ఆరు యూనిట్లలో విద్యుదుత్పత్తి కొనసాగుతుంది. ఈ మేరకు బుధవారం 6 యూనిట్ల ద్వారా విద్యుదుత్పత్తిని చేపట్టినట్లు ఎస్‌ఈ శ్రీధర్ తెలిపారు. ఎగువలో 6 యూనిట్ల ద్వారా 234 మెగావాట్లు, 361.564 ఎంయూ విద్యుదుత్పత్తిని చేపడుతున్నారు. ఎగువ, దిగువ జలవిద్యుత్ ఉత్ప త్తి కేంద్రాల్లో ఇప్పటివరకు 732.426 మిలియన్ యూనిట్లను విజయవంతంగా చేపట్టామన్నారు.
సుంకేసులకు 25వేల క్యూసెక్కుల ఇన్‌ఫ్లో
రాజోళి: సుంకేసుల డ్యాంకు బుధవారం ఇన్‌ఫ్లో వ చ్చి చేరుతున్నట్లు జేఈ మహేంద్ర తెలిపారు. ఎగు వ నుంచి 25,350 క్యూసెక్కులు ఇన్‌ఫ్లో రాగా.. 5గేట్లను ఒక మీటర్ మేర ఎత్తి 22,395 క్యూసెక్కులు దిగువకు వదిలినట్లు తెలిపారు. కేసీ కెనాల్‌కు 1,058క్యూసెక్కులు వదిలినట్లు పేర్కొన్నారు.
– ప్రాజెక్టుకు 2లక్షల 55వేల క్యూసెక్కుల ఇన్‌ఫ్లో
– 32గేట్లు ఎత్తి 2లక్షల 51వేల 422క్యూసెక్కుల విడుదల
– జల విద్యుత్ కేంద్రంలో కొనసాగుతున్న విద్యుదుత్పత్తి