
ప్రజా సమస్యలకు సత్వర పరిష్కారమే ధ్యేయం
కోనేరుసెంటర్: ప్రజా సమస్యల పరిష్కారమే ధ్యేయంగా పోలీసు వ్యవస్థ పనిచేస్తుందని ఎస్పీ వి. విద్యాసాగర్‌నాయుడు పేర్కొన్కారు. సోమవారం జిల్లా పోలీసు కార్యాలయంలో జరిగిన మీ కోసంలో పాల్గొన్న ఆయన జిల్లా నలుమూలల నుంచి వచ్చిన బాధితుల నుంచి అర్జీలు అందుకున్నారు. పలు అర్జీలను అక్కడికక్కడే పరిష్కరించిన ఆయన మరికొన్ని అర్జీలను సంబంధిత అధికారులకు సిఫార్సు చేసి వాటి పరిష్కారానికి తక్షణమే చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. మీ కోసంలో మొత్తం 42 అర్జీలు ప్రజల నుంచి అందినట్లు తెలిపారు.
వచ్చిన అర్జీల్లో కొన్ని..
అదనపు కట్నం కోసం శారీరకంగా, మానసికంగా వేధింపులకు గురి చేస్తున్న భర్త నుంచి రక్షించాలని కోరుతూ బంటుమిల్లికి చెందిన వనిత ఎస్పీకి అర్జీ అందించారు. వృద్ధాప్యంలో ఉన్న తనకు కూడు పెట్టకుండా కష్టాలపాలు చేస్తున్న కొడుకుల నుంచి రక్షణ కల్పించి న్యాయం చేయమని కోడూరు నుంచి రమణమ్మ అనే వృద్ధురాలు ఎస్పీకి అర్జీ అందజేశారు.
● స్నేహితుడని నమ్మి అప్పు ఇచ్చినందుకు తనపైనే బెదిరింపులకు పాల్పడుతూ దూషణ మాటలు మాట్లాడుతూ వేధింపులకు గురి చేస్తున్న వ్యక్తిపై చర్యలు తీసుకోవాలని కోరుతూ వంశీ అనే వ్యక్తి మీ కోసంలో ఎస్పీకి ఫిర్యాదు చేశాడు.
పెనమలూరు సర్పంచ్‌గా భాస్కరరావు కొనసాగింపు
పెనమలూరు: పెనమ లూరు సర్పంచిగా లింగా ల భాస్కరరావును కొనసాగిస్తూ హైకోర్టు ఉత్తర్వులు జారీ చేసింది. కేసు వివరాల్లోకి వెళితే.. పెనమలూరు సర్పంచి లింగాల భాస్కరరావు గ్రామంలోని పల్లిపేట కాలువ కట్టపై సిమెంట్ రోడ్డు నిర్మించారు. అయితే దీనిపై కలెక్టర్‌కు ఫిర్యాదులు అందటంతో జిల్లా పంచాయతీ అధికారి విచారించారు. ఇరిగేషన్ శాఖ అనుమతులు లేకుండా రోడ్డు వేశారని అభియెగాలు చూపు తూ డీపీవో నివేదిక ఇచ్చారు. దీంలో కలెక్టర్ గత మే నెలలో సర్పంచి భాస్కర రావును 3 నెలలు సస్పెండ్ చేసి చెక్‌పవర్ రద్దు చేస్తూ ఉత్తర్వులు ఇచ్చారు. దీనిపై భాస్కరరావు పంచాయతీరాజ్ శాఖ కమిషనర్‌కు అప్పీల్‌కు వెళ్లారు. అయితే అప్పీల్ పెండింగ్‌లో ఉంచి ఉత్తర్వులు ఇవ్వలేదు. దీంతో సర్పంచి హైకోర్టును ఆశ్రయించి రిట్ పిటిషన్ వేశారు. కోర్టు ఈ ఘటనపై పూర్తి విచారణ చేసింది. సర్పంచి సస్పెన్షన్ చేసి మూడు నెలలు గడిచినా ఎటువంటి విచారణ చేయకుండా సస్పెన్షన్ కొనసాగించటం సరైన చర్యకాదని కోర్టు భావించింది. సర్పంచిగా లింగాల భాస్కరరావును కొనసాగించి, అఽధికారాలు ఇస్తూ కోర్టు ఉత్తర్వులు ఇచ్చింది. దీంతో సర్పంచిగా భాస్కరరావు బాధ్యతలు చేపట్టారు.
ఎస్పీ విద్యాసాగర్ నాయుడు
హైకోర్టు ఉత్తర్వులు జారీ

ప్రజా సమస్యలకు సత్వర పరిష్కారమే ధ్యేయం