
కృష్ణా మిల్క్ యూనియన్‌కు స్వచ్ఛ ఇండస్ట్రీ అవార్డు
చిట్టినగర్(విజయవాడపశ్చిమ): స్వచ్ఛాంధ్ర అవార్డుల్లో భాగంగా కృష్ణా మిల్క్ యూనియన్‌కు బెస్ట్ స్వచ్ఛ ఇండస్ట్రీ అవార్డు లభించింది. ఎన్టీఆర్ జిల్లా విజయవాడలోని తుమ్మలపల్లి కళాక్షేత్రంలో స్వచ్ఛాంధ్ర అవార్డుల ప్రదానం సోమవారం జరిగింది. సీఎం చంద్రబాబునాయుడు చేతుల మీదుగా అవార్డుల ప్రదానోత్సవం జరగగా, బెస్ట్ స్వచ్ఛ ఇండస్ట్రీ– మెగా, భారీ పరిశ్రమల కేటగిరీలో మొదటి ర్యాంకును కృష్ణా మిల్క్ యూనియన్ వీరవల్లిలోని కామధేను ప్లాంట్‌ను వరించింది. ఈ అవార్డును సీఎం చంద్రబాబునాయుడు చేతుల మీదగా కృష్ణా మిల్క్ యూనియన్ చైర్మన్ చలసాని ఆంజనేయులు అందుకున్నారు. కార్యక్రమంలో యూనియన్ ఎండీ కొల్లి ఈశ్వరబాబు పాల్గొన్నారు.
●లక్షల మంది తాగేనీటిలో బూడిద అవశేషాలు
●బూడిద కాలుష్యంపై సీఎం, డెప్యూటీ సీఎంలు స్పందించాలి
●మాజీ మంత్రి జోగి రమేష్ డిమాండ్
ఇబ్రహీంపట్నం: కృష్ణా, గోదావరి నదుల అనుసంధాన ప్రాంతమైన పవిత్ర సంగమాన్ని కూటమి నేతలు, ఎన్టీటీపీఎస్ అధికారులు బూడిద నీటితో అపవిత్రం చేశారని మాజీ మంత్రి జోగి రమేష్ మండిపడ్డారు. ఎన్టీటీపీఎస్ అధికారులు బూడిద నీటిని బుడమేరు కాలువ ద్వారా కృష్ణానదిలో కలపడంపై ఆగ్రహం వ్యక్తం చేశారు. పవిత్ర సంగమ ప్రాంతాన్ని సోమవారం ఆయన పరిశీలించారు. కృష్ణానది ఒడ్డున ఉన్న సీఎం చంద్రబాబు బూడిద నీటి కాలుష్యాన్ని పరిశీలించాలన్నారు. అమరావతి, విజయవాడ, దివిసీమ, కై కలూరు డెల్టా ప్రాంత వాసులు కొన్ని లక్షల మందితో పాటు సీఎం చంద్రబాబు ఇంట్లో సైతం వాడేది కృష్ణాజలాలే అన్నారు. కాలుష్య నివారణ శాఖ మంత్రి పవన్ కల్యాణ్ దీనిపై దృష్టి సారించాలన్నారు. కాలుష్యంతో ప్రజలు అనేక రకాల వ్యాధుల బారిన పడుతున్నారని, ప్రజల ప్రాణాలతో చంద్రబాబు, పవన్‌కల్యాణ్ చెలగాటమాడుతున్నారని మండిపడ్డారు. కాలుష్యాన్ని అరికట్టేందుకు పార్టీలకు అతీతంగా మరో పోరాటం చేద్దామని పిలుపు నిచ్చారు. స్థానిక ఎమ్మెల్యే వసంత వెంకట కృష్ణప్రసాద్, అతని బావమరిది బూడిద దోపిడీపై కోట్లు సంపాదిస్తున్నారన్నారు. తనను అరెస్టు చేసినంత మాత్రాన సమస్యలు పరిష్కారం కావన్నారు. కార్యక్రమంలో జెడ్పీ వైస్ చైర్ పర్సన్ గరికపాటి శ్రీదేవి, జి.కొండూరు ఎంపీపీ వేములకొండ లక్ష్మీ తిరుపతమ్మ, మేడపాటి నాగిరెడ్డి తదితరులు పాల్గొన్నారు.

కృష్ణా మిల్క్ యూనియన్‌కు స్వచ్ఛ ఇండస్ట్రీ అవార్డు