
సుగర్ అదుపులో లేకుంటే ముప్పే..
ఇటీవల 30, 40 ఏళ్ల వయస్సులో బ్రెయిన్‌స్ట్రోక్‌కు గురైన వారిని చూస్తున్నాం. వారిలో మధుమేహులు కూడా ఉంటున్నారు. అదుపులో లేని మధుమేహం బ్రెయిన్ స్ట్రోక్‌కు దారి తీస్తోంది. రక్తనాళాలు కుచించుకుపోవడం, కొలెస్ట్రాల్, రక్తం గడ్డలు మెదడు రక్తప్రసరణపై ప్రభావం చూపుతాయి. మధు మేహాన్ని అదుపులో ఉంచుకోవడంతో పాటు, కొలెస్ట్రాల్, రక్తం పలుచబడే మందులు కూడా వైద్యుల సూచన మేరకు వాడాలి. సక్రమంగా మందులు వాడటం, ఆహార నియమాలు పాటించడం, వ్యాయామం ద్వారా స్ట్రోక్ రాకుండా చూడవచ్చు. – డాక్టర్ డి. అనీల్‌కుమార్ న్యూరాలజిస్ట్
●