
క్రమం తప్పకుండా మందులు వాడాలి..
మధుమేహులు దుష్పలితాలు రాకుండా చూసుకోవడం ఎంతో ముఖ్యం. అందుకు క్రమం తప్పకుండా మందులు వాడాలి. చాలా మంది ఒకసారి వైద్యుడు రాసిన మందులనే నెలల పాటు వాడుతుంటారు. అది మంచిది కాదు. ప్రతి మూడు నెలలకు ఒకసారి సుగర్‌లెవల్స్ పరీక్ష చేయించుకోవడం ద్వారా మందులు పనితీరు తెలుసుకోవచ్చు. అవసరమైతే వైద్యులు మందులు మార్చడం, డోసు పెంచడం, తగ్గించడం చేస్తారు. సక్రమంగా మందులు వాడటం, జీవనశైలి, ఆహారపు అలవాట్లు మార్చుకుంటే స్ట్రోక్ బారిన పడకుండా చూడవచ్చు. – డాక్టర్ ఎం. శ్రీకాంత్, మధుమేహ నిపుణుడు