
సూర్యలంక తీరంలో ఇద్దరు గల్లంతు : కాపాడిన సెక్యూరిటీ సిబ
బాపట్ల టౌన్: సూర్యలంక సముద్రతీరంలో స్నానాలు చేస్తూ ఇద్దరు యువకులు గల్లంతైన ఘటన ఆదివారం చోటుచేసుకుంది. తెలంగాణ రాష్ట్రం సూర్యాపేట జిల్లా టేకుమిట్ల గ్రామానికి చెందిన బొద్దు శ్రీను, నల్గొండ జిల్లాకు చెందిన కత్తుల వినేష్‌లు తమ కుటుంబ సభ్యులతో ఆదివారం మధ్యాహ్నం సూర్యలంక తీరానికి చేరుకున్నారు. సముద్రంలో స్నానాలు చేస్తుండగా ఒక్కసారిగా వచ్చిన అలల తాకిడికి ఇరువురు నీటిలో మునిగారు. గమనించిన కుటుంబసభ్యులు కేకలు వేయడంతో అప్రమత్తమైన కోస్టల్ సెక్యూరిటీ సిబ్బంది, గజ ఈతగాళ్లు సముద్రంలోకి వెళ్లారు. కొట్టుకుపోతున్న ఇద్దరు యువకులను సురక్షితంగా కాపాడి ఒడ్డుకు చేర్చారు. కోస్టల్ సెక్యూరిటీ సిబ్బంది, గజ ఈతగాళ్లను ఎస్పీ బి. ఉమామహేశ్వర్ ప్రత్యేకంగా అభినందించారు. తీరానికి వచ్చే పర్యాటకులు పోలీస్ సిబ్బంది ఆదేశాలను పాటించి, సముద్రస్నానాలు చేయాలని ఆయన సూచించారు.