
ఆటో పల్టీ ఎనిమిది మందికి గాయాలు
హనుమాన్‌జంక్షన్ రూరల్: చైన్నె–కోల్‌కత్తా జాతీయ రహదారిపై బాపులపాడు మండలం బొమ్ములూరు సమీపంలో జరిగిన రోడ్డు ప్రమాదంలో ఎనిమిది మంది గాయపడ్డారు. తూర్పుగోదావరి జిల్లా రాజమహేంద్రవరానికి చెందిన ఓ కుటుంబంలో ఇద్దరు భవానీమాల ధరించారు. మరో ఆరుగురు కుటుంబ సభ్యులతో కలిసి శనివారం విజయవాడలో కనకదుర్గమ్మను దర్శించుకున్నారు. ఇద్దరు మాలధారులు దీక్ష విరమించిన అనంతరం ఆటోలో తిరుగు ప్రయాణమయ్యారు. బొమ్ములూరు టోల్‌ప్లాజా సమీపంలోని ఫ్‌లై ఓవర్ బ్రిడ్జిపై గుర్తు తెలియని వాహనం ఆటోను ఢీకొంది. ఈ ప్రమాదంలో ఒక్కసారిగా ఆటో పల్టీ కొట్టింది. ఆటోలో ప్రయాణిస్తున్న ఎనిమిది మంది రోడ్డుపై పడటంతో స్వల్పంగా గ్రాయపడ్డారు. వారిని ఎన్‌హెచ్‌ఏఐ అంబులెన్స్‌లో ఏలూరు ప్రభుత్వాస్పత్రికి తరలించారు.

ఆటో పల్టీ ఎనిమిది మందికి గాయాలు