
చేపల వేటకు వెళ్లి వృద్ధుడి దుర్మరణం
అవనిగడ్డ: మండలంలోని పులిగడ్డ పల్లెపాలెం గ్రామానికి చెందిన సింగోతు నాగూర్(60) శుక్రవారం చేపల వేట నిమిత్తం వెళ్లి ప్రమాదవశాత్తు కాలువలో పడి మృతి చెందారు. స్థానిక లూప్ చానల్ వద్ద నాగూర్ మృతదేహం పంట కాలువలో పైకి తేలింది. మృతునికి భార్య, కుమారుడు ఉన్నారు. ఈ సమాచారం అందుకున్న అవనిగడ్డ ఎస్‌ఐ కె.శ్రీనివాస్ ఘటనాస్థలాన్ని సందర్శించి, అనుమానాస్పద మృతిగా కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం అవనిగడ్డ ఏరియా ఆస్పత్రికి తరలించారు. సింగోతు నాగూర్ మృతదేహాన్ని మాజీ ఎమ్మెల్యే సింహాద్రి రమేష్‌బాబు అవనిగడ్డ ప్రభుత్వాస్పత్రిలో సందర్శించి ప్రమాదం వివరాలను అడిగి తెలుసుకున్నారు. బాధితు కుటుంబ సభ్యులను పరామర్శించారు.